
ఒకరు గెలుపు కోసం రాజకీయాలు చేస్తారు… మరొకరు చరిత్ర మార్చడం కోసం పాలిటిక్స్‌లోకి వస్తారు. Great Leadership Isn’t About Power… It’s About Empowerment. తెలంగాణ రాజకీయాల్లో ఓ vibrant brand… యూత్ ఐకాన్… కల్వకుంట్ల తారక రామారావు. సింపుల్‌గా చెప్పాలంటే… ‘HE IS THE MAN OF MASSES & CLASSES. అటు గ్లోబల్ సమ్మిట్స్‌లో ఇంగ్లీష్‌తో మంత్రముగ్ధులను చేస్తారు.. ఇటు మైక్ పట్టుకుంటే తెలంగాణ యాసతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తారు. 2026 జూలై 24 నాటికి కేటీఆర్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకోనున్నారు. 50 ఏళ్ల వయసు.. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం.. కేటీఆర్ common man నుంచి పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు ఇప్పుడు ఓ లుక్ వేద్దాం…
1976 జూలై 24న… తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఇంట పుట్టిన ఆ పిల్లాడే ఇప్పుడు BRSని నడిపిస్తున్నాడు. రాజకీయ కుటుంబమే అయినా, చదువు విషయంలో కేటీఆర్ రూటే సెపరేట్. నిజామాబాద్, కరీంనగర్‌లలో ఆయన స్కూలింగ్ పూర్తి చేశారు. తర్వాత గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. హైదరాబాద్‌లోని నిజామ్ కాలేజీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ రోజుల్లో కేటీఆర్‌కు క్రికెట్ అంటే పిచ్చి ఉండేది. ఆయన మంచి ఆల్‌రౌండర్. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడేవారని కేటీఆర్ ఫ్రెండ్స్ చెబుతుంటారు.
పుణె యూనివర్సిటీలో Bio-Technologyలో MSc పూర్తి చేసి ఆ తర్వాత అమెరికా బాట పట్టారు. సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి కేటీఆర్ MBA in Marketing and E-Commerce పట్టా తీసుకున్నారు. కేవలం డిగ్రీలతో ఆగలేదు… కేటీఆర్ అమెరికాలోని City University of New Yorkలో MBA కూడా పూర్తి చేశారు. కేసీఆర్ కొడుకు అనే గుర్తింపుతో కాకుండా ఓ సాధారణ యువకుడిలా ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ‘INTEC’ అనే ఐటీ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా దాదాపు 3-4 ఏళ్లు పనిచేసి, Corporate Sectorలోని Technics స్వయంగా నేర్చుకున్నారు.
2006.. అది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న టైం. తండ్రి కేసీఆర్ పిలుపు.. స్వరాష్ట్ర కాంక్షతో రగులుతున్న తెలంగాణ ప్రజలు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పీక్స్‌లో ఉండగా కేటీఆర్ తన రూట్ మార్చుకున్నారు. లక్షల డాలర్ల సంపాదన… లగ్జరీ లైఫ్ స్టైల్… ఇవన్నీ వదిలేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సొంతగడ్డ మీదకు వచ్చారు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేశారు. తండ్రి అడుగుజాడల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాడు. 2010లో స్వరాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామ కూడా చేశారు.
Also Read : గ్లోబరీనా వ్యవహారంలో.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
2009 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన ఏ రోజు MLA ఓడిపోలేదు. వరుసగా సిరిసిల్ల నుంచే 5 సార్లు BRS జెండా ఎగరవేశారు. రైల్ రోకోలు, ధర్నాలు, అరెస్టులు దేనికీ KTR బెదరలేదు. 2014లో తెలంగాణ వచ్చేనాటికి ఆయన అంతగా రాజకీయాలు నేర్చుకోలేదు. పదేళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు చాలా నేర్పింది. కేటీఆర్ సభల్లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూలో ఈజీగా మాట్లాడేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిండంలో ఆయనకు అంటూ ఓ స్టైల్ ఉంది. కేటీఆర్ Data చూపించి మరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆయన పని చేసిన మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, గనులు & భూగర్భ వనరులు, ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖల్లోని అంశాలపై మంచి పట్టు ఉంది. బీఆర్ఎస్ హయంలో కేటీఆర్ ఐటీ రంగానికి కొత్త రంగులు దిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ హబ్‌గా ‘T-Hub’ను తీర్చిదిద్దారు. దావోస్ వేదికగా ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించారు. TS-iPASS వంటి సింగిల్ విండో విధానాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించారు.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో KTRదే కీ రోల్.. TRSగా ఉన్నప్పుడు పార్టీ ఫామ్‌లో ఉండేది. ఎప్పుడైతే పేరు మారిందో ఫామ్ కోల్పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే కాదు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 10 మంది MLAలు పార్టీ మారారు. అధికార పార్టీ నాయకులు BRSకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఇన్‌సల్ట్ చేశారు. పార్టీ చీఫ్ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమైయ్యారు. దీంతో అందరూ ఆ పార్టీ పని అయిపోయిందనుకున్నారు. అప్పటి వరకూ అధికార పార్టీలో అడ్మినిస్ట్రేషన్‌కే పరిమితమైన కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నారు. నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా.. ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. కేటీఆర్ BRSకి కమ్ బ్యాక్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి, ప్రజల్లోకి రాకున్నా కృష్ణార్జునుల్లా ఓ పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ పార్టీని నడుపుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో BRS కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. HCU భూములు, మూసీ బాధితులు, కొడంగల్ రైతుల ఇష్యూలతో కేటీఆర్ BRSకు మళ్లీ ప్రాణం పోశారు. సోషల్ మీడియాతో జనంలోకి వెళ్లడం KTR Expert. క్యాడర్‌ను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూ, సోషల్ మీడియా నుండి గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీ పెదన్నలా నిలిచారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. KTR స్టైల్ ఒక్కటే.. Fire & Action. 50 ఏళ్లు అంటే సంఖ్య కాదు.. జీవిత కాలపు అనుభవం. సాధారణంగా నాయకుల పుట్టినరోజులంటే ప్లెక్సీలు, హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ KTR ఆలోచన ఎప్పుడూ డిఫరెంట్. తన 50వ పుట్టినరోజు సందర్భంగా.. 50 మంది పేద విద్యార్థుల ఉన్నత చదువుల ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. అంతేకాదు.. పేపర్ లీక్స్‌పై ఢిల్లీలో సీజేపీ చేస్తున్న నిరసనలో చాలామంది విద్యార్ధులు గాయాలపాలయ్యారు. కేటీఆర్ పుట్టినరోజున సంబరాలకు దూరంగా టూ ఢిల్లీ ఆందోళనకారులకు మద్దతు తెలియజేస్తూ ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటానని చెప్పారు. Gift A Smile కింద అంబులెన్సులు, వికలాంగులకు వాహనాలు అందించిన KTR, ఈసారి విద్యార్థుల చదువు బాధ్యత తీసుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కేటీఆర్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.
20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ.. విజన్, క్లారిటీ, కెపాసిటీ కలిగిన నాయకుడిగా ముందుకుసాగుతున్న కల్వకుంట్ల తారక రామారావుకు RTV తరఫున 50th Birthday Wishes. నాయకుడికి వయసు అనేది ఒక నంబర్ మాత్రమే.. ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎప్పటికీ యంగ్ అండ్ డైనమిక్. Happy 50th Birthday to KTR.
Also Read : ఇందిరాపార్క్ వేదికగా బీఆర్‌ఎస్‌వీ ధర్నాకు అనుమతి, కేటీఆర్ హాజరు!









