Fire Accident : అహ్మదాబాద్‌లోని రామోల్ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపుగా10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం, సంబంధిత ఫ్యాక్టరీ లైసెన్స్ గడువు ముగియడంతో గతంలోనే అధికారులు దానిని మూసివేసి సీజ్ చేశారు. అయినప్పటికీ, రహస్యంగా మళ్లీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై అహ్మదాబాద్ డీసీపీ మయూర్ పాటిల్ మాట్లాడుతూ, “రామోల్ ప్రాంతంలోని అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ 2026 మార్చి 31న ముగియడంతో గతంలోనే మేము దానిని మూసివేసి సీజ్ చేశాం. అయితే నిర్వాహకులు అక్రమంగా ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అదే ఈ ఘోర ప్రమాదానికి కారణమై 10 మంది ప్రాణాలు కోల్పోయారు” అని వెల్లడించారు.

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అక్రమంగా నడుస్తున్న పరిశ్రమలపై ప్రత్యేకంగా కఠిన చర్యలు చేపట్టినట్లు డీసీపీ మయూర్ పాటిల్ తెలిపారు. గడువు ముగిసిన లైసెన్స్‌లతో కొనసాగుతున్న ఫ్యాక్టరీల విషయంలో భూ యజమానులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

Also Read : ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేత!

దీంతో భూ యజమానులు తమ భూములపై గడువు ముగిసిన లైసెన్స్‌లతో కొనసాగుతున్న ఫ్యాక్టరీలను కూల్చివేసే చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ప్రక్రియను పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను పోలీసులు, స్థానిక పరిపాలన అధికారులు పర్యవేక్షిస్తుండగా, అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : వీడియోలు చూసే టైమ్ లేదు, మా టైమ్ వృథా చేయకండి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.