Rahul Gandhi:  ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లి బలవంతంగా వ్యాన్‌లో ఎక్కిస్తుండగా, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల చర్యల మధ్య ఆయన ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది.

Also Read : ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలాగో మీకు తెలుసా?

Also Read : హిమాలయాల్లో పర్యావరణ విలయం: ప్రకృతి విపత్తుల వెనుక మితిమీరిన మానవ ప్రమేయం!

మోదీ, అమిత్ షాలతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా నేరుగా ధర్నా స్థలానికి చేరుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన సమయంలో ఆయన రోడ్డుపైనే పడుకోవడం తీవ్ర హైడ్రామాకు దారితీసింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గకపోవడంతో, బలవంతంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆ ప్రాంతం మొత్తం భారీ పోలీసు బలగాల మోహరింపుతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.