Nokia 300 4G Power Bank
Nokia 300 4G Power Bank

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నోకియా తాజాగా Nokia 300 Power Bank ఫోన్‌ను ఫిలిప్పీన్స్‌లో విడుదల చేసింది. ఇది ఒక కీప్యాడ్ ఫోన్. పేరుకు తగ్గట్టుగానే కంపెనీ దీనిని ఒక పవర్ ఫోన్‌గా పరిచయం చేసింది. Nokia 300 Power Bank ఫోన్‌లో 2.4-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది స్ట్రాంగ్ బాడీతో వస్తుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP రేటింగ్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో పెద్ద బ్యాటరీని అందించింది. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Nokia 300 4G Power Bank Price

Nokia 300 4G Power Bank Price ఫోన్ ధర దాదాపు రూ. 3,000గా కంపెనీ నిర్ణయించింది. దీనిని షోపీ నుండి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, డార్క్ గ్రీన్, లైట్ గోల్డ్ కలర్‌లలో అందుబాటులోకి వస్తుంది.

Nokia 300 4G Power Bank Specifications

Nokia 300 4G Power Bank ఫోన్‌లో 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో వెనుక వైపు 0.3-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనికి IP65 రేటింగ్‌ను అందించారు. ఇది మైక్రో SD కార్డ్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. దీని ద్వారా మెమరీని 32GB వరకు ఎక్పండ్ చేసుకోవచ్చు.

Nokia 300 4G Power Bank ఫోన్‌లో కంపెనీ 3700mAh బ్యాటరీని అమర్చింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఇది 45 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 26 గంటల టాక్ టైమ్, ఫ్లాష్‌లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు 23 గంటల సమయాన్ని కూడా అందిస్తుందని తెలిపింది. దీని ఫ్లాష్‌లైట్ ఒక సాధారణ ఫీచర్ ఫోన్ కంటే 5 రెట్లు ఎక్కువ కాంతిని అందిస్తుందని, ఐఫోన్ 16 ప్రో కంటే రెండింతలు ప్రకాశవంతంగా వెలుగుతుందని కంపెనీ పేర్కొంది. దీనికి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కంపెనీ అందించింది. అలాగే ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక ప్రత్యేక బటన్ అందించారు. ఆ బటన్‌ను నొక్కితే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ యాక్టివేట్ అయి ఫోన్ పవర్ బ్యాంక్‌గా మారుతుంది. ఇది 5W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.