
Donald Trump : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం (MoU) కథ ముగిసిపోయిందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) కూటమి శీతాకాల/శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వంపై విరుచుకుపడిన ఆయన.. వారితో మాట్లాడటం కేవలం సమయం వృథా చేసుకోవడమేనని స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికా తీవ్రంగా స్పందించింది. ప్రతికార చర్యగా అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన తీరప్రాంత నిఘా వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలపై భారీ స్థాయిలో (80కి పైగా) వైమానిక దాడులు జరిపింది. ముఖ్యంగా బందర్ అబ్బాస్, సిరిక్ రేవు పట్టణాలు, కెస్మ్ (Qeshm) ద్వీపంలోని ప్రధాన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విరుచుకుపడింది. బహ్రెయిన్, కువైట్లలో ఉన్న అమెరికాకు చెందిన సుమారు 85 సైనిక స్థావరాలు, లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది.
దాడి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ చమురు విక్రయించుకునేందుకు గతంలో ఇచ్చిన తాత్కాలిక లైసెన్స్‌ను అమెరికా ట్రెజరీ శాఖ తక్షణమే రద్దు చేసింది.ఈ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలలో సైరన్ల మోత మోగడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 5 శాతానికి పైగా పెరిగాయి.
Also Read : ఇండోనేషియా పర్యటనలో మోదీ.. టెంపుల్ కు తీసుకెళ్లిన అ దేశ అధ్యక్షుడు
“వారు మానసిక రోగులు.. సమయం వృథా”: డొనాల్డ్ ట్రంప్
అంకారాలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ తీవ్ర పదజాలంతో ఇరాన్‌పై విరుచుకుపడ్డారు:”నా దృష్టిలో అయితే ఈ ఒప్పందం ముగిసిపోయింది. ఇకపై వారితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలని నేను అనుకోవడం లేదు. వారు అబద్ధాలకోరులు, మానసిక రోగులు. వారిని నడిపించే నాయకులు కూడా మానసిక రోగులే. అత్యంత క్రూరులైన వారి చేతికి గనుక అణుఆయుధం చిక్కితే ఖచ్చితంగా వాడేస్తారు. వారితో డీల్ గురించి మాట్లాడటం అంటే టైమ్ వేస్ట్ ప్రోగ్రామ్.” అంటూ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.తన ప్రతినిధులు ఇరాన్‌తో చర్చలు కొనసాగించవచ్చని, కానీ దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనే దానిపై తనకు నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : వరద బీభత్సం.. కూలిన స్నేక్ ఫార్మ్.. చైనా ఇళ్లలోకి వందలాది పాములు
పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం
గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం ఈ వరుస దాడులతో పూర్తిగా ప్రమాదంలో పడింది. ఒకవైపు నాటో సభ్య దేశాలు అమెరికా తీసుకున్న చర్యలను మద్దతుగా పేర్కొంటుండగా, మరోవైపు ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని, హోర్ముజ్ జలసంధిపై తన పట్టును వదులుకునేది లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయేమోనన్న భయాందోళనలు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతున్నాయి.









