అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పొటాషియం, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువ శాతం మంది ఉదయాన్నే అరటి పండ్లు తింటారు. కొందరి ఆరోగ్యానికి ఇవి మేలు చేసినా మరికొందరికి మాత్రం అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అరటి పండ్లను ఉదయాన్నే తినకూడదో చూద్దాం.

Also Read : నీట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై 6 రోజుల పాటు పరీక్షలు.. కేవలం ఆన్‌లైన్‌లోనే?

కిడ్నీ సమస్యలు

కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు అరటిపండ్లను అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులో ‘పొటాషియం’ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మన శరీరం పొటాషియంను ఫిల్టర్ చేస్తుంది. కానీ కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు అవి రక్తంలో ఉన్న అధిక పొటాషియంను బయటకు పంపలేవు. దీనివల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగిపోయి గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

మధుమేహం

బాగా పండిన అరటిపండ్లలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగిపోతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ముఖ్యంగా షుగర్ కంట్రోల్‌లో లేనివారు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్ సలహా మేరకు కేవలం సగం పండు మాత్రమే తీసుకోవాలి.

ఊబకాయం

బరువు తగ్గాలని డైట్ ఫాలో అయ్యేవారు అరటిపండ్లను అమితంగా తినకూడదు. ఒక మీడియం సైజ్ అరటిపండులో సుమారు 100 కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో అరటిపండ్లు తింటే శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి బరువు తగ్గడానికి బదులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మైగ్రేన్

తరచూ మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు అరటిపండ్లను దూరంగా పెట్టడం మంచిది. అరటిపండ్లలో ‘టైరమైన్’ అనే పదార్థం ఉంటుంది. ఇది మైగ్రేన్ నొప్పులను మరింత తీవ్రం చేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పండుపై నల్లటి మచ్చలు వచ్చి బాగా పండిన వాటిలో ఈ టైరమైన్ ఎక్కువగా ఉంటుంది.

Also Read : తమిళనాడులో సంచలనం.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!

మలబద్ధకం

బాగా పండని లేదా పచ్చిగా ఉన్న అరటిపండ్లను తింటే మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. వీటిలో స్టార్చ్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది. అలాగే కొంతమందికి అరటిపండ్లు తిన్న వెంటనే కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి.

శ్వాసకోశ సమస్యలు

అరటిపండు శరీరంలో కఫాన్ని పెంచుతుందని నమ్ముతారు. కాబట్టి తీవ్రమైన జలుబు, దగ్గు లేదా అస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్న సమయంలో అరటిపండ్లను తినకపోవడం ఉత్తమం. ఇది అలర్జీలను కూడా ప్రేరేపించే అవకాశం ఉంది.