Ai+ Pulse 2 flipkart offers
Ai+ Pulse 2 flipkart offers

స్మార్ట్‌ఫోన్లకు ప్రపంచ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో కంపెనీలు పలు రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా మరో న్యూ మొబైల్ అతి తక్కువ ధరలో లాంచ్ అయింది. అదే Ai+ Pulse 2 స్మార్ట్‌ఫోన్. ఇది భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా, పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Ai+ Pulse 2 Price

Ai+ Pulse 2 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.8,999లకే లభిస్తుంది. అలాగే 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా కంపెనీ నిర్ణయించింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.450 తగ్గింపు పొందొచ్చు. పేటెమ్ నుంచి పేమెంట్ చేస్తే కేవలం రూ.50 మాత్రమే వస్తుంది. అలాగే రూ.5,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తే.. 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.3,099లకే కొనుక్కోవచ్చు. అయితే పూర్తి డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Ai+ Pulse 2 Specifications

Ai+ Pulse 2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 450 నిట్స్ బ్రైట్‌నెస్‌‌కి మద్దతిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 12nm ప్రాసెస్‌పై నిర్మించిన యూనిసోక్ T7250 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 1.8GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ చిప్‌సెట్. ఈ Ai+ Pulse 2 ఫోన్‌లో AI ఫీచర్లకు మద్దతు ఇచ్చే 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే భారీ 6000mAh బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత నెక్స్ట్‌క్వాంటమ్ ఓఎస్ కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం కంపెనీ ఈ ఫోన్‌కు IP64 రేటింగ్‌ను కూడా అందించింది.