lenin

LENIN Trailer : అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్ ట్రైలర్ వచ్చేసింది! వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో మెప్పించిన మురళీ కిశోర్‌ అబ్బూరు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వైజాగ్‌లో గ్రాండ్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా విలేజ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. “ఇది మహాభారతం.. చిత్తూరు జిల్లాలో ప్రతి ఏటా ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మను కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన.. ఎట్టిపరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందకూడదు..” అంటూ కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. ఆ తర్వాత అఖిల్, భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ సీన్లు, వారిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా బాగా కుదిరినట్లు కనిపిస్తోంది.

ఆ తర్వాత వచ్చే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు.. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు.. ఆ పొద్దు నుంచి శ్రీరామపురంలో అసలు మహాభారతం మొదలైంది అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే నన్ను దాటి ఈ వసంత్ గాన్ని తాకండ్రా సూద్దాం.. అంటూ ఒక్కో పాత్ర రంగులు మార్చడం ట్రైలర్‌లో చూపించారు.

ముఖ్యంగా ట్రైలర్ చివర్లో.. మీ కాళ్లు పట్టుకుంటాన్నా.. భారతిని వదిలేయండ్రా.. అది నా ప్రాణం.. అని అఖిల్ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. కురుక్షేత్రంలో ఆఖరిగట్టం విశ్వరూపం అని చివరగా సునీల్ చెప్పే డైలాగ్, ఆ వెంటనే చూపించే భారీ రక్తపాతం, యాక్షన్ సీన్లు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

మొత్తానికి లెనిన్ ట్రైలర్ ప్రామిసింగ్‌గా, ఊరమాస్ ఎలిమెంట్స్‌తో ఫుల్ ప్యాక్డ్‌గా ఉంది. గ్రామీణ నేపథ్యం, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అదిరిపోవడంతో.. ఈసారి మన అయ్యగారు గట్టిగానే హిట్టు కొట్టేట్టు ఉన్నాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. జులై 10న థియేటర్లలో లెనిన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.