
ఇది కదా ఆఫర్ అంటే.. ఇది కదా డిస్కౌంట్ అంటే.. ఇప్పుడు ఈ సేల్‌ను మిస్ అయ్యారంటే ఐఫోన్‌ను కొనుక్కోవడం ఇక కష్టమనే చెప్పాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఐఫోన్ ధరలు భారీగా పెరగబోతున్నాయి. అందువల్ల త్వరలో అందుబాటులోకి రానున్న ఓ భారీ సేల్‌లో ఐఫోన్ సిరీస్‌లు భారీ డిస్కౌంట్లతో అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఆ సేల్ ఏంటి?.. అందులో ఐఫోన్ సిరీస్ ధరలు, డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : రాముడి గుడిలో చేరాకే నిందితులకు లగ్జరీ లైఫ్.. అయోధ్య చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
Flipkart GOAT SALE
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ‘GOAT SALE’ పేరుతో అదిరిపోయే సేల్‌ను ప్రకటించింది. ఇది జూలై 4న ప్రారంభం కాబోతుంది. అంతకంటే ఒకరోజు ముందు అంటే జూలై 3న ప్లస్, బ్లాక్ మెంబర్స్‌కు ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో Flipkart ఐఫోన్ సిరీస్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. iphone 17పై ఏకంగా రూ.12వేలు, iphone 17 pro మోడల్‌పై ఏకంగా రూ.22 వేల వరకు భారీ తగ్గింపులను ఇస్తోంది.
Goat Sale Iphone 17 Offers
iphone 17 లాంచ్ సమయంలో రూ.82,900లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ flipkart goat sale లో కేవలం రూ.70,990లకే అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ.12వేల భారీ తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే Iphone 17 pro మోడల్ రూ.1,34,900లకు లాంచ్ కాగా.. ఈ సేల్‌లో రూ.1,12,900లకు పొందొచ్చు. అంటే దీనిపై ఏకంగా రూ.22వేల భారీ తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే iphone pro maxను కూడా రూ.22వేల భారీ తగ్గింపుతో కేవలం రూ.1,27,900లకే అందుబాటులో ఉంది. ఇంకా iphone17eను రూ.60,900, iphone airను రూ.95,900, iphone 16ను రూ.59,900, iphone 16 plusను రూ.73,900, iphone 16eను రూ.55,900, iphone 15ను రూ.49,900 ధరతో సొంతం చేసుకోవచ్చు.
వీటితో పాటు భారీ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ICICI, BOB, HSBC క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే కొత్తగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకునే వారికి రూ.3వేల వెల్కమ్ ఓచర్లు అందిస్తుంది.
Also Read : తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. DMKకు దిమ్మతిరిగే షాక్!









