
వెనిజులాలో ఇటీవల భారీ భూకంపం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బహుళ అంతస్తుల భవనాలు పేకమేడళ్ల నేలకూలాయి. ఈ విషాదం మరువక ముందే మరోసారి భూకంపం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.
Philippines Earthquake
తాజాగా దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. రాత్రి 7.30 గంటల సమయంలో భూమి కంపించగా.. ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. ముందు జాగ్రత్తగా అధికారులు ప్రజలను అలెర్ట్ చేశారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించారు.
మొదట దీని తీవ్రతను 6.7గా అధికారులు అంచనా వేశారు. కానీ ఆ తర్వాత దీనిని 6.5గా సవరించారు. ఇది మిండనావో ద్వీపంలోని జోస్ అబాద్ సాంటోస్ పట్టణానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది. ఈ భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.









