
Modi Cabinet Reshuffle 2026 : నేషనల్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఒకే ఒక్క హాట్ టాపిక్ నడుస్తోంది. అదే కేబినెట్ మార్పు. ఆదివారం లేదా సోమవారమే కేబినెట్ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో 38 మంది మంత్రులపై వేటు పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి సీనియర్ లీడర్లను కూడా తొలగిస్తున్నారా ?.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఎవరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కనుంది ?
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ అఫీషియల్ మీటింగ్‌లో మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన డేట్స్, ప్రోటోకాల్స్‌పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్రపతి భవన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. కానీ, పొలిటికల్ సమీకరణాల ప్రకారం.. తెరవెనుక మాత్రం భారీ కసరత్తే జరుగుతోంది.
కేబినెట్ మార్పు చేసేందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. పనితీరు గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని కేంద్ర మంత్రులను ఈసారి పదవి నుంచి తొలగించాలని కేంద్రం భావిస్తోంది. రెండోది.. ఎన్నికల సమీకరణాలు. ఈ ఏడాది చివర్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో పొలిటికల్ మైలేజ్ కోసం.. అక్కడున్న ఎంపీలకు కేబినెట్ బెర్తులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయబోతోంది. అంతేకాదు.. ఈసారి మోదీ కేబినెట్‌లో చాలా కాలంగా ఉన్న కొందరు సీనియర్లను పక్కన పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యువతకు, ముఖ్యంగా జెన్-జీ తరం నాయకులకు ప్రాముఖ్యత ఇవ్వావని పార్టీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. యంగ్ ఓటర్లను అట్రాక్ట్ చేయడమే టార్గెట్‌గా కొత్త తరం నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని మోదీ సర్కార్ భావిస్తోంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు
నీట్ పేపర్ లీక్ వివాదంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. ముఖ్యంగా జెన్‌జీ యువత నుంచి కూడా ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన్ని కేబినెట్ నుంచి పూర్తిగా తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విద్యాశాఖ పదవి అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. విద్యాశాఖలో రిఫామ్స్ కోసం ఆమెను అక్కడికి పంపి.. ఆర్థిక శాఖకి కొత్త లీడర్‌షిప్‌ను తీసుకురావొచ్చని టాక్ వినిపిస్తోంది. అలాగే పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరిని కేబినెట్ నుంచి పూర్తిగా తప్పించే అవకాశాలున్నాయి. గతంలో సమాచార, క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన యంగ్ లీడర్ అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కనుందని తెలుస్తోంది. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తి కాంత దాస్‌కు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.
ఈసారి కేబినెట్ మార్పులో బీజేపీ మాత్రమే కాదు..ఏన్టీయేకు కూడా భారీ ప్రాధాన్యత దక్కబోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి శివసేన (షిండే వర్గం) నుంచి.. ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు కేబినెట్ మినిస్టర్ పదవి దక్కే ఛాన్స్ క్లియర్‌గా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా కొత్త మంత్రుల లిస్టులో బలంగా వినిపిస్తున్నాయి. రామాయణ సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్‌కు కూడా కేబినెట్ బెర్త్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ మాజీ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో ఒక స్పెషల్ స్టేటస్ లేదా ప్రత్యేక స్థానం కల్పించే దిశగా చర్చలు నడుస్తున్నాయట. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా నుంచి గెలిచిన ఎంపీలకు కేంద్ర కేబినెట్‌లో అవకాశాలు రానున్నాయి. కేబినెట్ మొత్తంలో పనితీరు సరిగా లేని 38 మంది మంత్రులపై వేటు పడనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఏపీ, తెలంగాణ రాజకీయ సమీకరణాలను బట్టి ఈసారి కేంద్ర పెద్దలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొదటగా తెలంగాణ విషయానికి వస్తే.. సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం దాదాపు ఖాయం అంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్‌కు చివరి నిమిషంలో మిస్ అయ్యింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడం నగేశ్ ఉన్నారు. ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుదని ఆయన ధీమాతో ఉన్నారు. అలాగే, బీసీ సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా కేంద్రమంత్రి వర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మహిళా కోటాలో.. డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం 8 మంది బీజేపీ ఎంపీలు ఉండగా, ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయమంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనేది చర్చ నడుస్తోంది. రెండు పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుందని టాక్ ఉంది. ఆ రెండు పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ జరుగుతోంది.
ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి.. బీజేపీ ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రెటరీ పదవిని కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన కొడుకు బండి భగీరథ్ రేప్ కేసు అంశం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. దీంతో బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నట్లు పొలిటికల్ సర్కిల్క్స్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈసారి డైరెక్ట్‌గా క్యాబినెట్ బెర్త్ దక్కబోతోందని ఢిల్లీ వర్గాల ద్వారా గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని మరింత స్ట్రాంగ్ చేయాలనే ప్లాన్‌తో పురందేశ్వరికి కీరోల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేబినెట్ మార్పు ఇండియన్ పాలిటిక్స్‌లో ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఆదివారం లేదా సోమవారం రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం దేశమంతా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.









