Workplace Rule : ఆఫీసుల్లో ఉద్యోగుల పనితీరును పెంచేందుకు రకరకాల నిబంధనలు పెట్టడం మామూలే, కానీ ఒక కంపెనీ పెట్టిన రూల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇంతకు ఆదేంటంటే లంచ్ బ్రేక్ ఒక్క నిమిషం ఎక్కువైనా సరే.. దానికి బదులుగాసాయంత్రం ఒక గంట సేపు అదనంగా రూపాయి జీతం లేకుండా పని చేయాలంటూ ఒక ఆఫీస్ బోర్డుపై పెట్టిన నోటీస్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నోటీస్ ఏ కంపెనీకి చెందింది అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఇందులో ఉన్న వింత నిబంధన మాత్రం నెటిజన్లకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తోంది.

వైరల్ అవుతున్న ఆ నోటీస్ ప్రకారం.. ఉద్యోగులకు లంచ్ బ్రేక్ టైమ్ కేవలం 30 నిమిషాలు మాత్రమే. ఒకవేళ మీ లంచ్ బ్రేక్ 30 నిమిషాల కంటే ఒక్క నిమిషం ఎక్కువైనా సరే.. మీరు కంపెనీకి ఒక గంట పాటు అదనంగా పని చేసి పెట్టాలి. సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ అయిపోయాక, రూపాయి జీతం లేకుండా 7 గంటల వరకు కూర్చుని ఫోకస్ టైమ్ పేరుతో పని చేయాల్సి ఉంటుంది అని ఆ మెమోలో రాసి ఉంది. అంతేకాకుండా, ఆ నోటీస్ చివర్లో త్వరగా తినండి అంటూ రెండు ముక్కల్లో ఆర్డర్ వేసింది ఆ కంపెనీ యాజమాన్యం.

Also Read : సాంకేతికత సృష్టించిన అద్భుతం… విపత్తు వేళ రక్షణ కవచంగా స్మార్ట్‌ఫోన్

ఇదో మూర్ఖపు నిబంధన

జూన్ 22న ఎక్స్ వేదికగా షేర్ అయిన ఈ ఫోటోను ఇప్పటికే లక్షకు పైగా నెటిజన్లు చూశారు. ఈ నిబంధనపై ఉద్యోగులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదో మూర్ఖపు నిబంధన అని, ఒక్క నిమిషం ఆలస్యానికి గంట సేపు ఉచితంగా పని చేయించుకోవడం చట్టవిరుద్ధమని మండిపడుతున్నారు. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. “ఒకవేళ ఉద్యోగి సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్క నిమిషం అదనంగా పని చేసినా.. కంపెనీ అతనికి ఒక గంట అదనపు జీతం ఇవ్వాలి, అప్పుడే న్యాయం” అని కామెంట్ చేయగా ఉద్యోగులను ఇలా హింసిస్తే కంపెనీలు ఎప్పటికీ బాగుపడవని మరొకరు రాసుకొచ్చారు.

Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఎయిమ్స్‌లో 1,484 ఉద్యోగాలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.