
Trisha Krishnan : తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మరియు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌ల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా విజయ్ పుట్టినరోజు వస్తే త్రిష ఎలాంటి క్రేజీ పోస్ట్ పెడుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, జూన్ 22న విజయ్ పుట్టినరోజు ముగిసినా త్రిష నుండి ఎలాంటి శుభాకాంక్షలు రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు శరవేగంగా చక్కర్లు కొట్టాయి. వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని, బంధం ముగిసిపోయిందంటూ నెటిజన్లు రకరకాల గాసిప్స్‌ను తెరపైకి తెచ్చారు.
View this post on Instagram
అన్‌ఫాలో రూమర్స్.. ఊహాగానాలకు బూస్టప్:
తమిళనాడు ఎన్నికల ముందు నుంచే విజయ్, త్రిషల రిలేషన్‌షిప్‌పై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ వచ్చింది. దానికి తోడు విజయ్ విడాకుల కేసు ప్రస్తావన కూడా ఈ ప్రచారాలకు మరింత ఊపునిచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ పుట్టినరోజున త్రిష సైలెంట్‌గా ఉండటం, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె విజయ్ను అన్‌ఫాలో చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇద్దరికీ ‘బ్రేకప్’ అయిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ సైలెన్స్ వారి మధ్య దూరం పెరిగిందనే పుకార్లకు మరింత బూస్టప్ ఇచ్చినట్లయింది.
ఒకే ఒక్క పోస్టుతో పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్:
తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారాలన్నింటికీ త్రిష తనదైన స్టైల్లో ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టుతో పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ వేశారు. జూన్ 23న (ఒక రోజు ఆలస్యంగా) ఆమె తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేస్తూ అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ఫొటోలో త్రిష, విజయ్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఎంతో సంతోషంగా బర్త్‌డే కేక్ కట్ చేస్తూ కనిపించారు. విజయ్ ఎదురుగా బర్త్‌డే కేక్స్ ఉంచి, ఆయన్నే త్రిష ఎంతో ఆప్యాయంగా చూస్తున్న ఈ ఫొటో అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌లా నిలిచింది.
నా జీవితానికి అర్థాన్ని ఇచ్చే వ్యక్తివి:
విజయ్‌కి బర్త్‌డే విషెస్ చెబుతూ త్రిష పెట్టిన క్యాప్షన్ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “నా జీవితంలో ప్రతి దానికి ఒక అర్థాన్ని ఇచ్చే (వీటన్నింటి విలువ పెంచే) ఆ ప్రత్యేకమైన వ్యక్తికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని క్యాప్షన్‌గా జత చేసింది. ఈ పోస్ట్ ఇన్‌స్టాంట్‌గా సోషల్ మీడియాను షేక్ చేసింది. పోస్ట్ చేసిన నిమిషాల్లోనే కీర్తి సురేష్‌తో పాటు లక్షలాది మంది నెటిజన్లు దీనిని లైక్ చేస్తూ, వేలల్లో కామెంట్లు కురిపించారు. త్రిష విష్ లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్గా వచ్చి నెట్టింట పూనకాలు తెప్పిస్తోందంటూ విజయ్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో రచ్చ మొదలుపెట్టారు.
వింటేజ్ కాంబో క్రేజ్:
గతంలో విజయ్, త్రిషల కాంబినేషన్లో వచ్చిన గిల్లి, తిరుపాచి, ఆరు, కురువి వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. చాలా కాలం విరామం తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ (Leo) సినిమాలో ఈ వింటేజ్ కాంబో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుని థియేటర్లను షేక్ చేసింది. కాగా, రీసెంట్గా విజయ్ తన చివరి సినిమా ‘జననాయగన్’ (Jana Nayagan) షూటింగ్ ముగించుకుని, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పూర్తిగా ప్రజా సేవలో బిజీ అయ్యారు. గత రెండు రోజులుగా నడుస్తున్న రూమర్స్ అన్నింటికీ ఈ క్రేజీ అప్డేట్తో త్రిష ఒక్కసారిగా తెరదించినట్లయింది.









