ఖతార్‌లోని అత్యంత కీలకమైన ‘రస్ లఫాన్’ పారిశ్రామిక నగరంలో రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించగా, వారిలో 12 మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. ఇంకొకరు పాకిస్తాన్‌కు చెందినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి మరో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

Also Read : మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. నాలుగు విమానాశ్రయాల మూసివేత..

Massive Explosion At Qatar Gas Plant

పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్ జరిపిన బాంబు దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా రస్ లఫాన్ క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తిని ఖతార్ ప్రభుత్వం గతంలో నిలిపివేసింది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం ముగిసి పరిస్థితులు అనుకూలించడంతో.. పనులను మళ్లీ మొదలుపెట్టేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించి, మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది.

Also Read : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. వీడియోలు వైరల్‌!