
Donald Trump : అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ పూర్తిగా సర్వనాశనమైపోయిందని, ఆ దేశం కథ ఇక ముగిసిపోయిందని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ప్రెసెంట్ ఇరాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ , నేవీ కనీసం యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ రేడార్లు కూడా మిగలలేదని, వారి సైనిక శక్తి పూర్తిగా జీరో అయిపోయిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుండి ఇరాన్‌కు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా నిధులు అందవని, కనీసం పది పైసలు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
తన రాజకీయ ప్రత్యర్థులు అయిన డెమోక్రాట్లపై కూడా ట్రంప్ ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయిందని డెమోక్రాట్లు చెప్తుండడంపై ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో వరుస పోస్టులతో కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ పరిస్థితి ఇప్పుడు బాగుందని డెమోక్రాట్లు అంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? జనాలు అంత పిచ్చోళ్లా అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. యుద్ధం తర్వాత తాము ఏమీ డీల్ కోసం ఆరాటపడలేదని, ఇరాన్ దేశమే తీవ్రమైన నిరాశతో అండ్ కంగారుతో చర్చల కోసం ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 60 రోజుల టైమ్‌లైన్ ప్రకారం తాము ముందుకెళ్తామని, కానీ వాళ్లకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని క్లియర్ చేశారు.
ఒక రోజు ముందే
ట్రంప్ ఈ కామెంట్స్ చేయడానికి ఒక రోజు ముందే.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో డీల్ కుదుర్చుకోవడం కోసం చాలా ఆరాటంగా ఉన్నారని, అందుకోసం అన్ని రకాల ఒత్తిడిలను ఉపయోగించారని ఖమేనీ విమర్శించారు. అమెరికా-ఇరాన్ ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత మొదటిసారి మాట్లాడిన మొజ్తబా.. తాను మొదట్లో ఈ డీల్‌ను సూత్రప్రాయంగా వ్యతిరేకించానని చెప్పారు. అయితే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ అండ్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు ఇచ్చిన భరోసా వల్లే తాను ఒప్పుకున్నానని, ఈ డీల్ వల్ల ఇరాన్ ప్రయోజనాలకు అండ్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు ఎలాంటి నష్టం జరగదని నమ్మబలికారని ఆయన ఇరాన్ ప్రజలకు వివరించారు.









