lemon juice
lemon juice

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటారు. ఇది బరువు తగ్గడానికి, శరీరాన్ని శుభ్రపరచడానికి బాగా పనిచేస్తుంది. నిమ్మరసంలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే డైలీ ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. సరైన పద్ధతిలో తాగకపోతే అన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!

రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగే వారు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య దంతాల ఎనామిల్ దెబ్బతినడం. నిమ్మకాయలో ‘సిట్రిక్ యాసిడ్’ చాలా ఎక్కువగా ఉంటుంది. పరగడుపున నిమ్మరసం నేరుగా దంతాలకు తగలడం వల్ల, పళ్ల పైన ఉండే రక్షణ పొర క్రమంగా కరిగిపోతుంది. దీనివల్ల పళ్లు బలహీనపడటమే కాకుండా, చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పళ్లు జివ్వున లాగడం మొదలవుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే నిమ్మరసం తాగేటప్పుడు ఎల్లప్పుడూ ‘స్ట్రా’ ఉపయోగించాలి. దీనివల్ల రసం నేరుగా పళ్లకు తగలకుండా గొంతులోకి వెళ్తుంది. అలాగే నిమ్మరసం తాగిన వెంటనే బ్రష్ చేయకూడదు. ఎందుకంటే యాసిడ్ వల్ల పళ్లు అప్పటికే మెత్తబడి ఉంటాయి. ఆ సమయంలో బ్రష్ చేస్తే ఎనామిల్ మరింత త్వరగా అరిగిపోతుంది. నిమ్మరసం తాగాక మంచి నీళ్లతో నోటిని బాగా పుక్కిలించడం మంచిది.

ఇది కూడా చూడండి: Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : ‘ఇండో’ పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..

చాలా మంది బరువు త్వరగా తగ్గాలనే ఆశతో ఎక్కువ మొత్తంలో నిమ్మరసం వేస్తారు. కానీ పరగడుపున కడుపులో యాసిడ్స్ ఇప్పటికే ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు ఈ సిట్రిక్ యాసిడ్ కూడా తోడైతే, కడుపులో తీవ్రమైన మంట లేదా గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ రోజులు ఇలాగే అతిగా నిమ్మరసం తాగుతూ ఉంటే జీర్ణాశయం లోపలి పొరలు దెబ్బతిని ‘అల్సర్లు’ ఏర్పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అల్సర్లు, మైగ్రేన్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే నిమ్మరసానికి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే సమస్యలు వస్తాయి.  అయితే నిమ్మరసం బాడీని హైడ్రేట్ చేస్తుందని అనుకుంటారు. కానీ నిమ్మరసంలో ఉండే విటమిన్-సి కి ‘డైయూరిటిక్’ గుణం ఉంటుంది.

ఇది కూడా చూడండి: Meenakshi Natarajan Case : రిటర్నింగ్‌ అధికారి vs ప్రజాస్వామ్యం

అంటే ఇది శరీరంలోని కిడ్నీలను వేగంగా పనిచేసేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ మీరు నిమ్మరసం తాగిన తర్వాత సరిపడా మంచి నీళ్లు తాగకపోతే.. శరీరంలో ఉండాల్సిన అవసరమైన నీరు, సోడియం వంటి లవణాలు బయటకు పోయి, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల నీరసం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, మోతాదు మించకూడదు. ఒక గ్లాసు నీటిలో అర చెక్క నిమ్మరసం కంటే ఎక్కువ వాడకూడదు. వీలైతే అందులో కొద్దిగా తేనె కలుపుకోవడం వల్ల యాసిడ్ ప్రభావం కొంత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Manoj
I am Manoj Varma, an SEO specialist working at RTV since December 2023. He specializes in search engine optimization, keyword research, on-page SEO, technical SEO, and content strategy, helping websites improve organic visibility and search rankings.