
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికా కేంద్ర సైనిక దళం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టింది. అధునాతన క్షిపణులు, డ్రోన్ల సహాయంతో ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను, కీలక సైనిక స్థావరాలను అమెరికా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై అమెరికా స్పందిస్తూ.. ఇరాన్ గత కొంతకాలంగా అనుసరిస్తున్న దూకుడు వైఖరి వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
https://x.com/SriLankaTweet/status/2064870425000391035









