
Tiger Shroff Car Attack: ఒకే ఒక్క ఘటన బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రముఖ యాక్షన్ హీరో ట్రైగర్ ష్రాప్ (Tiger Shroff)పై దుండగులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకున్న కొందరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నటుడు టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోగా.. ఆయన కారు డ్రైవర్‌తో పాటు సమీపంలోని నిలబడి ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఊహించని భయానక ఘటన ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన జుహు (Juhu) పరిధిలో చోటుచేసుకుంది. దీంతో ముంబైలో ఒక్కసారిగా కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం.. మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు నటుడు టైగర్ ష్రాఫ్ కారుకు దగ్గరగా వెళ్లి (Tiger Shroff Car Attack) ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మొత్తం 5 రౌండ్లు పేల్చినట్లు సమాచారం.
Multiple shots allegedly fired at Tiger Shroff’s car in Mumnai as he was exiting the ground after playing football.
Someone please verify.
@MumbaiPolice @CPMumbaiPolice
#TigerShroff #Mumbai #MumbaiPolice https://t.co/Ynu6u9mTsc— Ashok Bijalwan 🇮🇳 (@AshTheWiz) October 18, 2026
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పరిస్థితిని సమీక్షించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి పరారీలో ఉన్న ముగ్గురు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియారాలేదు. ఇది వ్యక్తిగత కక్షల పన్నాగమా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.









