
Kolkata : దుర్గా పూజ అంటే కోల్‌కతాలో ఓ పెద్ద పండుగ. ఈ పండుగ సమయంలో నగరంలోని పూజా మండపాలను చూడటానికి లక్షల మంది బయటకు వస్తారు. ఇలాంటి సమయంలో జనాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. కానీ కోల్‌కతాలో మరోసారి అదే సమస్య ప్రాణాలు తీసింది. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా పూజా మండపం దగ్గర శనివారం రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
శనివారం రాత్రి చోర్‌బగాన్ పూజా మండపానికి భారీగా జనం వచ్చారు. వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగింది. అదే సమయంలో భారీ వర్షం మొదలైంది. వర్షం నుంచి తప్పించుకోవడానికి బయట ఉన్నవాళ్లు మండపంలోకి వెళ్లేందుకు తొందరపడ్డారు. అప్పటికే లోపల కూడా చాలా మంది ఉన్నారు. దీంతో గేటు దగ్గర ఒక్కసారిగా జనం ఎక్కువయ్యారు. మండపంలోకి వెళ్లే గేటు చాలా ఇరుకుగా ఉందని, బయటకు వచ్చే గేటు కూడా చిన్నగానే ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అక్కడ సరైన లైటింగ్ కూడా లేదని తెలిపారు. ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం.. మండపంలోకి వెళ్లేందుకు దాదాపు గంటన్నర పాటు జనం క్యూలో నిలబడ్డారు. వర్షం మొదలవడంతో అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
Also Read : కర్నూలు మేయర్ బరిలో అత్తాకోడళ్లు.. మేయర్ పీఠం కోసం ప్రత్యర్థులుగా!
ఈ క్రమంలో కొంతమంది కిందపడిపోయారు. వాళ్లపై మరికొందరు పడటంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. చాలామంది స్పృహ కోల్పోయారు. గాయపడిన వారిని కొంతమందిని మోటార్‌సైకిళ్లపై కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తన తల్లిని కోల్పోయిన 25 ఏళ్ల సోను పాల్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి. నా కళ్ల ముందే అమ్మ చనిపోయింది. నేను కూడా బతికి ఉండకపోయేవాడిని అతను చెప్పాడు. వర్షం పడుతుండటంతో బయట ఉన్నవాళ్లు లోపలికి రావడానికి ఒకరినొకరు తోసుకున్నారని సోను తెలిపాడు. తాను కూడా ఆ గుంపులో చిక్కుకున్నానని, ఎలాగోలా బయటపడి తల్లి దగ్గరకు వెళ్లేసరికి ఆమె కనిపించలేదని చెప్పాడు.
చోర్‌బగాన్ ఘటన తర్వాత ఇప్పుడు అందరికీ 2015లో జరిగిన మరో ఘటన గుర్తుకొస్తోంది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం.. 2015 అక్టోబర్ 18న కూడా కోల్‌కతాలో దుర్గా పూజ సందర్భంగా భారీ రద్దీ ఏర్పడింది. అది దక్షిణ కోల్‌కతాలోని దేశప్రియ పార్క్‌లో. 2015లో దేశప్రియ పార్క్‌లో భారీ దుర్గా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం 88 అడుగుల ఎత్తులో ఉండటంతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఆ విగ్రహాన్ని చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. అది ఆదివారం కావడంతో జనాలు మరింత ఎక్కువయ్యారు. మండపం బయట భారీ క్యూలు ఏర్పడ్డాయి. ఒకేసారి వేలాది మంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనం ఒకరినొకరు తోసుకోవడం మొదలైంది. కొంతమంది కిందపడిపోయారు. మరికొందరికి ఊపిరి ఆడక ఇబ్బంది వచ్చింది. మండపం లోపల కూడా జనం కిందపడిపోయారు. ఆ ఘటనలో కనీసం 11 మంది గాయపడ్డారు. అప్పుడు కూడా జనం ఎక్కువగా ఉండటం, రద్దీని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవడం ప్రధాన సమస్యగా కనిపించింది.
Also Read : ఏపీ స్థానిక ఎన్నికలు.. 17 కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు ఇవే!









