
Tiranga March : ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి బిగ్ షాక్ తగిలింది. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ఈరోజు సాయంత్రం తలపెట్టిన ‘తిరంగా మార్చ్’ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. న్యూఢిల్లీలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశిస్తూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్న రాణి ఝాన్సీ రోడ్డులోని ఎన్‌సిపి-ఎస్సిపి అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసానికి చేరుకున్న పోలీస్ బృందాలు ఈ నోటీసులను అందజేశాయి.
Also Read : అరే ఏంట్రా ఇది: 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి లవ్ మ్యారేజ్: అసలు కథేంటంటే?
ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకం ఊపుతూ నిరసన తెలిపి అరెస్టయిన పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కస్టడీకి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ పీఆర్ఓ నేహా యాదవ్ హెచ్చరించారు. అయితే, శాంతియుతంగా జెండా ఎగురవేయడం నేరం కాదని, దేశం కోసం అరెస్టు కావడానికైనా సిద్ధమని దీప్కే స్పష్టం చేశారు. తనపై నిఘా ఉంచారని కూడా ఆయన ఆరోపించారు.
ఈ నిరసన పిలుపుతో దేశ రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 6,000 మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది, 220 కంపెనీల పారామిలిటరీ (CAPF) బలగాలను మోహరించారు. కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్, సంసద్ మార్గ్ ప్రాంతాల్లో పటిష్టమైన బారికేడ్లు, అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా సెంట్రల్ పార్క్‌ను అక్టోబర్ 16, 17 తేదీల్లో మూసివేస్తున్నట్లు NDMC ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Also Read : ఊపిరి పీల్చుకో: ఢిల్లీ వాయు కాలుష్యానికి చెక్.. రంగంలోకి AI 24×7 నిఘా..!









