
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీగా నటించిన కొత్త చిత్రం ‘రణబలి’ ఈరోజు థియేటర్లలో రిలీజైంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామాప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
1876-1878 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో వచ్చిన దారుణమైన కరువు నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఒక వైపు కరువుతో ప్రజలు అల్లాడిపోతుండగా.. మరోవైపు బ్రిటిష్ పాలకులు అక్కడి ప్రజలను రక్తం పిండి పన్నులు వసూలు చేస్తూ అరాచకాలు చేస్తుంటారు. ఈ అన్యాయాలను రణబలి ఎలా ఎదుర్కొన్నాడు. తమ సీమ ప్రజల కోసం తిరగబడి ఎలా నిలబడ్డాడు?.. అనేది ఈ మూవీ కథ.
#Ranabaali Public Review 🔥👀🥳
Ranabaali 🤝 Baahubali 🦁🔥
Is Tollywood gearing up for another Baahubali-level cinematic experience? 🤯💥
#VijayDeverakonda & #RashmikaMandanna together on screen is PURE FIRE! 🔥✨
The hype is REAL! 🚀🔥 https://t.co/If3pIvaY39
— AMIT (@AmitManoj5) October 16, 2026
Also Read : పునీత్ చనిపోయే ముందు ఏం జరిగిందంటే.. ఐదేళ్ల తర్వాత అసలు విషయం బయటపెట్టిన డాక్టర్
ఎవరెలా నటించారు..
ఈ మూవీలో విజయ్ దేవరకొండ రణబలి పాత్రలో అదరగొట్టేశాడు. ముఖ్యంగా అతడి మేకోవర్, యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. రాయలసీమ యాసలో మోస్ట్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో కట్టిపడేశాడు. పోరాట సీన్లలో విజయ్ పండించే భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇప్పటి వరకు విజయ్ చేసిన సినిమాల అన్నింటిలో ఇది ప్రత్యేకమైన పాత్రగా నిలిస్తుంది.
ఇక ఈ సినిమాలో జయమ్మ పాత్రలో రష్మికను తప్ప మరెవరినీ ఊహించుకోలేరు. ఈ పాత్రలో రష్మిక నటన సినిమాకే ప్రాణం పోసిందనుకోవచ్చు. ఇందులో కథానాయకుడికి సరిసమానమైన భాగస్వామిగా ఆమె యాక్టింగ్ బాగా సెట్ అయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది.
ఇక ఈ మూవీకి మరో ప్లస్ యాక్టర్ అర్నాల్డ్ వోస్లూ. బ్రిటిష్ అధికారిగా ఆయన విలనిజం అందరినీ అలరించింది. ఆయన పాత్ర సినిమాకి పెద్ద బలంగా నిలిచింది. ఇక డైరెక్షన్, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అంతా సినిమాకు బలంగా కనిపించింది.
సెకండాఫ్‌లో కథ మరింత ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. కొన్ని సన్నివేశాలు పాత్రల భావోద్వేగాలను బలంగా చూపిస్తాయి. యాక్షన్‌తో పాటు తన వాళ్ల కోసం పోరాడే ఒక వ్యక్తి ప్రయాణాన్ని చూపించడం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. పీరియడ్ వరల్డ్‌ని క్రియేట్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది.
సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావడం, దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సినిమాకు మరింత పాజిటివ్ కానుంది. సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు విజయ్ కు చాలా కాలం తరువాత భారీ హిట్టు రావడంతో ఫాన్స్ కూడా తెగ ఖుషి అవుతున్నారు.
Also Read : సూపర్‌స్టార్‌గా ఉండటం కంటే బస్ కండక్టర్‌గానే ఇష్టం : రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు









