
ఒక కారు రోడ్డుపై ప్రయాణించడం సాధారణ విషయమే. అదే కారు గాల్లో ఎగిరితే ఎలా ఉంటుందో కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ ఇప్పుడు అది నిజజీవితంలో కళ్లముందు కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్లు కళ్లముందు రోడ్లపై తిరిగిన కార్లు.. ఇకపై గాల్లో కూడా తిరగగలవు అనేలా ఓ స్పోర్ట్స్ కారు స్టంట్లు చేసి చూపించింది. అది చూసిన ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. ఈ అద్భుతాన్ని ప్రముఖ ప్రపంచ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా టెక్సాస్‌లో ‘టెస్లా రోడ్‌స్టర్’ (Tesla Roadster) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్‌ను ఆవిష్కరించింది. ఇది రోడ్లపై రయ్ రయ్ మంటూ పరిగెత్తడమే కాకుండా.. గాల్లో కూడా ఎగరగలదు. ఈ కారు లాంచ్ ఈవెంట్లో చేసిన స్టంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో.. కారు గాల్లోకి లేవడం, గాల్లోనే పల్టీలు కొట్టడం, ఆ తర్వాత మెల్లిగా కిందకి దిగడం.. అచ్చం రాకెట్ ల్యాండింగ్ అవుతున్నట్టే అనిపించింది.
Also Read : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి!
https://t.co/KBWjjWknXe
— Elon Musk (@elonmusk) October 16, 2026
ఇక ఈ కారు వేగంలో కూడా తగ్గేదే లే అన్నట్లు ఫీచర్లను పొందింది. కళ్లు మూసి తెరిచేలోపే వంద కిలో మీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. కేవలం 0.81 సెకన్లలోనే ఈ కారు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెప్పింది. ఇక ఈ రోడ్‌స్టర్‌లో ముఖ్యమైనది రాకెట్ వేరియంట్. ఇందులో 10 రాకెట్ థ్రస్టర్లను అమర్చారు. వీటివల్లే కారు గాల్లోకి లేవడం, గాల్లో విన్యాశాలు చేయడం చేస్తుంది. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్ రోదసి టెక్నాలజీని ఈ కారు తయారీలో ఉపయోగించారు. దీనివల్లనే ఇది ఒక కారుగా మాత్రమే కాకుండా.. గాల్లో ఎగిరే ‘ఫ్లైయింగ్ కార్’గా అనుభూతి ఇస్తుంది.
కంపెనీ ఈ రోడ్‌స్టర్ కారును మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఆల్రెడీ దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే.. ఇందులోని రాకెట్ థ్రస్టర్ మోడల్ అందరికీ అందుబాటులో ఉండదు. దీన్ని పొందాలంటే టెస్లా కంపెనీ అనుమతి అవసరం.
🚨
Not AI , its Tesla #Roadster 🫡 https://t.co/xZ676XMQMO
— UttarandhraNow (@UttarandhraNow) October 16, 2026
Also Read : జర్మనీలో షాకింగ్ ఘటన.. 16 ఏళ్ల బాలికపై రోబో దారుణం.. అసలు ఏమైందంటే?
Tesla Roadster Prices
టెస్లా కంపెనీ లాంచ్ చేసిన రోడ్ స్టర్ కారు ధరల విషయానికొస్తే.. దీని బేస్ వేరియంట్ ధర సుమారు $200,000 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1.66 కోట్లు), ఫౌండర్స్ సిరీస్ వేరియంట్ ధర సుమారు $250,000 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2.08 కోట్లు). ఈ వేరియంట్ మొదటి 1,000 మంది కస్టమర్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారుచేశారు. ఇక టాప్ మోడల్ రాకెట్ / స్పేస్ఎక్స్ వేరియంట్ ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.









