
ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. సాధారణంగా ఒక అమ్మాయి లేదా అబ్బాయి వయసులో ఉన్నపుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం సహజం. అదే పెన్సన్ తీసుకునే వయసులో ఉన్న ఒక వృద్ధుడు 30 ఏళ్ల మహిళను లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవ్వడమంటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా ఇప్పటి యువత పెళ్లి వద్దంటే వద్దురా బాబోయ్ అంటుంటే.. ఇంకొందరు పిల్లలు దొరక్క పెళ్లికోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ జంటను చూసి వారంత ముక్కున వేలేసుకుంటున్నారు.
Also Read : యుద్ధం వస్తే ఆయుధాలు పట్టాల్సిందే.. సన్యాసులకు యోగి పిలుపు!
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యాకు చెందిన 30 ఏళ్ల బ్లాగర్ రీనా, 75 ఏళ్ల రామ్ సాగర్ల ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీరి పరిచయం ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా వీరి ఎంగేజ్మెంట్, హల్దీ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ జంట వార్తల్లోకెక్కింది. దీంతో వీరి లవ్ స్టోరీ తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిచూపిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
అందిన సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల నౌషద్ అహ్మద్‌కు ఇది వరకే పెళ్లై ఒక భార్య ఉండేది. అయితే ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇక అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతి అహ్మద్ ఇంటికి సమీపంలోనే నివసించేది. అయితే ఆ యువతి ఫ్యామిలీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండటంతో అహ్మద్ అప్పుడప్పుడు వారికి సహాయం చేస్తూ ఉండేవాడు.
#WATCH : 75 Year Old Man to Marry 30 Year Old Woman in Uttar Pradesh’s Auraiya
An unusual love story is making headlines in Auraiya district of Uttar Pradesh, where 75-year-old Ramsugar is reportedly set to marry 30-year-old Rani Rajput.
The couple fell in love around a year ago, and their ring ceremony has already taken place. The wedding is expected to be held after Navratri.
Rani, who reportedly creates Instagram Reels, used to visit Ramsugar’s home to meet his daughter. Their relationship is said to have developed during these visits.
#Auraiya #UttarPradesh #LoveStory #Ramsugar #RaniRajput
— upuknews (@upuknews1) October 15, 2026
Also Read : సెలెక్టర్ పదవి వద్దంటున్న స్టార్ క్రికెటర్లు.. BCCI ఆఫర్‌కు నో!
అలా అహ్మద్.. ఆ యువతి ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వయస్సులో పెద్దవాడైనప్పటికీ.. ఆయన చేస్తున్న సహాయానికి ఆ యువతి ఆకర్షితురాలైంది. రోజులు గడిచిన కొద్దీ వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య దాదాపు 45 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ.. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి గురించి నిర్ణయం తీసుకున్నారు. వయస్సు కేవలం నంబర్ మాత్రమేనని.. మనసులు కలిస్తే చాలని భావించిన ఈ జంట.. తమ పెళ్లి నిర్ణయాన్ని యువతి ఫ్యామిలీకి తెలిపాయి. వారు కూడా అహ్మద్‌పై నమ్మకంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో వీరి పెళ్లికి ఎలాంటి అడ్డు లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో తాజాగా ఎంగేజ్మెంట్ పూర్తయింది. ఇప్పుడు వీరి పెళ్లి తేదీకి సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









