New WhatsApp feature
New WhatsApp feature

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp New Feature) తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తరచూ కొత్త కొత్త అప్డేట్లతో ఆకట్టుకుంటున్న సంస్థ.. తాజాగా ‘గెస్ట్ కాల్స్’ (WhatsApp Guest Calls) అనే కొత్త ఫీచర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. మీ వద్ద వాట్సాప్ యాప్ లేకపోయినా.. లేదా పూర్తిగా వాట్సాప్ అకౌంటే లేకపోయినా కూడా మీరు ఇతరులతో వాట్సాప్ వాయిస్ లేదా వీడియో కాల్స్‌లో మాట్లాడవచ్చు.

గత కొన్ని వారాలుగా బీటా విధానంలో ఈ ఫీచర్‌‌ను పరీక్షిస్తున్నట్లు సంస్థ ఇటీవల తెలిపింది. అయితే ఇప్పుడు అధికారికంగా అందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. కాగా ఈ సేవలకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఫ్రీ, అలాగే ఎలాంటి టైమ్ లిమిట్ కూడా ఉండదు. పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. తమ యూజర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకునే ఈ ఫీచర్‌లో కొన్ని నియమాలు పెట్టినట్లు వాట్సాప్ వెల్లడించింది. దీనికోసం ఇందులో ప్రత్యేక అనుమతి ప్రక్రియను తీసుకొచ్చింది. అంటే అవతలి వ్యక్తి ప్రమేయం లేనిదే.. నేరుగా కాల్‌లో యాడ్ చేయడం కుదరదు.

దీనికోసం వాట్సాప్ అకౌంట్‌ ఉన్న వినియోగదారుడు ముందుగా ఒక కాల్ లింక్‌ను క్రియేట్ చెయ్యాలి. దాన్ని ఇతరులకు పంపితే.. అవతలి వ్యక్తి ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత అప్రూవ్ చేసి కాల్‌లో యాడ్ అవ్వొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే గెస్ట్ కాలర్ ఆ లింక్‌ మెసేజ్‌ను తొలగించుకోవచ్చు. అలాగే వాట్సాప్ యూజర్‌ కూడా అనవసరం అనుకుంటే ఏ సమయంలోనైనా గెస్ట్‌ను కాల్ నుండి రిమూవ్ చేయవచ్చు.

Also Read : రూ.2 కోసం రూ.లక్ష ఫైన్.. వాటర్ బాటిల్‌తో వాత పెట్టిన కస్టమర్!

గెస్ట్ కాల్స్ ఎలా ఉపయోగించాలి?

వాట్సాప్ యాప్‌ ఓపెన్ చేసి Calls ట్యాబ్‌కు వెళ్లాలి.
అక్కడ ‘+’ ఐకాన్‌‌ను క్లిక్ చేసి కాల్ లింక్‌ను క్రియేట్ చేయాలి.
ఆ లింక్‌ను వాట్సాప్ లేనివారికి లేదా ఉన్న ఏ వ్యక్తికైనా షేర్ చేయవచ్చు.
దీని ద్వారా గెస్ట్ కాలర్ సులభంగా కాల్‌లో జాయిన్ అవ్వవచ్చు.

కాగా ఈ గెస్ట్ కాల్‌లో యాడ్ అయ్యే వినియోగదారులు వాట్సాప్ కాల్స్‌లో ఉండే అన్ని ఫీచర్లను యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షేరింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎమోజీలతో కూడా రియాక్ట్ కావచ్చు.

Also Read : జంతర్ మంతర్ దగ్గర నిరసనలు బ్యాన్.. దీని చరిత్ర ఏంటో తెలుసా?