
ప్రస్తుతం సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. మనుషులు చేసే పనులను యంత్రాలు, రోబోలు చేస్తున్నాయి. అయితే టెక్నాలజీని మంచికి కాకుండా చెడు పనులకు వాడితే ఎంతటి అనర్థాలు వస్తాయో చెప్పడానికి జర్మనీలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. రోబోలు కూడా వేధింపులకు పాల్పడవచ్చనే నిజాన్ని ఈ ఘటన బయటపెట్టింది.
‼️BREAKING: German police seized a robot that sexually assaulted a 16-year-old girl by touching her ass and making thrusting motions at her.
Officers found it stashed in the boot of a Volkswagen.
Its 16-year-old owner and a 19-year-old companion allegedly livestreamed it. https://t.co/MTUBuXcgtT
— International Cyber Digest (@IntCyberDigest) October 12, 2026
జర్మనీలోని కొలోన్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కొందరు మహిళలు, యువతుల వద్దకు అకస్మాత్తుగా ఒక రోబో వచ్చింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా దగ్గరకు వెళ్లిన ఆ రోబో వారి పట్ల అత్యంత అనుచితంగా ప్రవర్తించింది. రోడ్డుపై వెళ్తున్న ఒక 16 ఏళ్ల బాలికను బలవంతంగా ఆలింగనం చేసుకోవడంతో పాటు, ఆమెను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించింది. ఆ రోబో చేసిన ఈ పనికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
అయితే ఈ వింత ఘటన వెనుక టెక్నాలజీ దుర్వినియోగం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రోబో తనంతట తానుగా అలా ప్రవర్తించలేదని, వెనుక నుండి ఎవరో ఉద్దేశపూర్వకంగా దానిని కంట్రోల్ చేశారని తేలింది. ఈ దారుణాన్ని ఇద్దరు టీనేజీ యువకులు సోషల్ మీడియాలో ఏకంగా లైవ్ ఇవ్వడం మరింత కలకలం రేపింది. ఆ రోబోకు యజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల బాలుడు, అతడి స్నేహితుడు కలిసి కావాలనే రిమోట్ లేదా ఫోన్ ద్వారా ఆ రోబోను కంట్రోల్ చేస్తూ ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆ రోబోతో పాటు దాన్ని కంట్రోల్ చేయడానికి వాడిన యువకుల సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ రోబోలో ఇలాంటి కదలికలను ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టారా? లేక ఆ యువకులు లైవ్లో ఉంటూ అప్పటికప్పుడు దాన్ని అలా ప్రవర్తించేలా మార్చారా? అనే కోణాలలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.








