
L. Murugan : కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2029 లోక్సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మురుగన్.. కేంద్ర మంత్రి పదవి నుంచి తనను తప్పించాలని కోరారు. అలాగే, పార్టీ కోసం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
It has been the greatest honour of my life to serve Bharat Mata and Tamil Nadu under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji.
From the son of daily wage labourers to serving in the Union Council of Ministers under the leadership of Hon’ble PM Shri @narendramodi Ji has been the greatest privilege of my life.
Now, I wish to return to the grassroots, stand with our karyakartas and dedicate myself full-time to strengthening the BJP in Tamil Nadu ahead of the 2029 Lok Sabha elections.
Nation First. Party Next. Self Last. 🙏🇮🇳
@NitinNabin @blsanthosh
— Dr.L.Murugan (@DrLMurugan) October 13, 2026
Also Read : డ్రగ్స్ దందాపై ప్రశ్నిస్తే.. లైవ్ లోనే తుపాకీతో కాల్చి చంపేశాడు!
తమిళనాడులోని గ్రామాలు, వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలవాలని, పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలని మురుగన్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ చెబుతున్న సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఉందని మురుగన్ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ప్రతి కుటుంబానికి భాగస్వామ్యం కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
మురుగన్ ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసార శాఖతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, ఇకపై తన సమయాన్ని, శక్తిని మొత్తం తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడానికి, 2029 లోక్సభ ఎన్నికలకు సిద్ధం చేయడానికి కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర కేబినెట్లో మార్పులు జరగనున్నాయనే ప్రచారం నేపథ్యంలో మురుగన్ రాజీనామా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : జంతర్ మంతర్ దగ్గర నిరసనలు బ్యాన్.. దీని చరిత్ర ఏంటో తెలుసా?









