ఎప్పుడు కొట్టుకునే రష్యా, పాకిస్తాన్ దేశాలు ఇప్పుడు సడెన్‌గా స్నేహితులుగా మారిపోతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన నమ్మకమైన హోంమంత్రి వ్లాదిమిర్ కొలోకోల్ట్సెవ్‌ను నేరుగా పాకిస్తాన్‌కు పంపించారు. రష్యా చరిత్రలోనే ఒక హోం మంత్రి పాక్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. నాలుగు రోజుల టూర్ కోసం ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన ఇతనికి పాక్ లీడర్లు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికారు. అసలు ఈ రెండు దేశాలు సడన్‌గా ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? ఇండియా మీదకు ఏమైనా ఎటాక్ ప్లాన్ చేస్తున్నాయా? అనే సందేహాలు మొదలవుతున్నాయి.

Also Read : సౌదీని వణికిస్తున్న హూతీ దాడులు.. కుప్పకూలిన ఎయిర్ డిఫెన్స్.. అసలు ఏం జరుగుతోంది?

పాక్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఇచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు కొలోకోల్ట్సెవ్ ఇస్లామాబాద్‌కు వెళ్లారు. ఆయన విమానం దిగగానే పాకిస్తాన్ హోం శాఖ సహాయ మంత్రి తలాల్ చౌదరి స్వయంగా వెళ్లి ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య శాంతిభద్రతలు, పోలీసింగ్, సెక్యూరిటీ విషయాలపై సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా, దాని మిత్రదేశాలు రష్యా మీద కఠినమైన ఆంక్షలు పెట్టాయి. దీంతో రష్యా తాను తయారు చేస్తున్న ఆయిల్, గ్యాస్‌ను అమ్ముకోవడానికి కొత్త మార్కెట్ల కోసం వెతుకుతోంది.

మరోవైపు పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. తక్కువ రేటుకి ఆయిల్ దొరికితే చాలు అని చూస్తున్న ఆ దేశం, రష్యా వైపు చేయి చాచింది. పుతిన్ కూడా ఆల్రెడీ పాక్‌తో మా రిలేషన్స్ మంచిగానే ఉంటున్నాయని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. షాంఘై ఆర్గనైజేషన్‌లోనూ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా కలిసి పనిచేయాలని చూస్తున్నాయి. భారత్‌, రష్యా మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధాలు ఉన్నాయి. ఆయుధాలు అయినా, టెక్నాలజీ అయినా మనకు అండగా నిలిచింది రష్యాయే. అలాంటి రష్యా భారత్‌కు శత్రువైన పాకిస్తాన్‌తో చేతులు కలపడంతో భారత్‌పై ఏమైనా ఎటాక్ ప్లాన్ చేస్తున్నాయా అనే సందేహాలు మొదలవుతున్నాయి.

Also Read : హౌతీల దాడులు.. బంకర్‌లో సౌదీ యువరాజు!