
Saudi Arabia : సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హూతీ తిరుగుబాటుదారుల దాడులతో భయపడిపోతున్నారు. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు రియాద్‌పై వరుసగా క్షిపణి దాడులు చేస్తుండటంతో యువరాజు బయటకు రాకుండా గట్టి భద్రత మధ్య ఉంటున్నారు. గత ఆరు రోజులుగా 41 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ బంకర్లు ఉన్న, భారీ భద్రత కలిగిన రాజభవనాల మధ్య మారుతూ ఉంటున్నారని తెలుస్తోంది. దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపింది.
Also Read : ఇమ్రాన్ ఖాన్‌కు మరో దెబ్బ.. పీటీఐ పాలనపై గవర్నర్ పాలన!
శనివారం సౌదీ అరేబియాపై దాడి జరిగింది. కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరగడంతో 13 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. ఆ తర్వాత రోజు కూడా సౌదీ రాజధాని రియాద్‌లోని విమానాశ్రయంపై మరోసారి దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 11 మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి దళాలకు, ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది.
వరుస దాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. సౌదీ అరేబియా ప్రతిదాడి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, తాము కూడా ఎదురుదాడిలో పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ నిన్న విలేకరులతో చెప్పారు. అయితే, ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మరోవైపు, రియాద్‌పై హూతీ దాడులు పెరుగుతున్న సమయంలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గట్టి భద్రత మధ్య బయటకు కనిపించకుండా ఉంటున్నారు. ఆయన చివరిసారిగా మంగళవారం బహిరంగంగా కనిపించారు. దేశంలో రక్తదాన కార్యక్రమానికి మద్దతుగా ఆయన స్వయంగా రక్తదానం చేశారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు.
కాగా టర్కీ, పాకిస్థాన్, ఈజిప్ట్ దేశాలు సౌదీపై దాడులను ఖండించాయి. సౌదీ అరేబియాకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. టర్కీ మాత్రం తమ సైనికులను పంపి నేరుగా దాడుల్లో పాల్గొనే ఆలోచన లేదని తెలిపింది.
Also Read : రష్యా-ఉక్రెయిన్ వార్.. కరెంట్, ఆయిల్ ఫ్యాక్టరీలపై నో ఎటాక్.. ట్రంప్ సంచలన డీల్









