
దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. ఈ పండుగల కోసం పట్టణాల్లో ఉండే చాలా మంది ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో దూరప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎక్కువగా ట్రైన్ జర్నీనే ఎంచుకుంటారు. సేఫ్టీ అండ్ కంఫార్ట్‌గా ఉండటంతో ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ట్రైన్ టికెట్ దొరకడం చాలా కష్టం. నెల ముందు నుంచి టికెట్ బుకింగ్ చేసినా.. కన్ఫార్మ్ అవుతుందో లేదోనన్న టెన్షన్. అందువల్ల చాలామంది తత్కాల్ ఆప్షన్‌ను ఎంచుకుంటారు. అయితే తత్కాల్ ద్వారా కూడా టికెట్స్ దొరుకుతాయన్న నమ్మకం ఉండదు. క్షణాల వ్యవధిలో టికెట్లు అయిపోతుంటాయి. అయితే కొన్ని స్మార్ట్ ట్రిక్స్ అండ్ ప్లానింగ్ ఉంటే టికెట్‌ను ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మాస్టర్ లిస్ట్ (Master List)
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో IRCTC Rail Connect లేదా RailOne యాప్‌ను యూజ్ చేయొచ్చు. కొందరు కన్ఫార్మ్ టికెట్ యాప్ కూడా వాడుతుంటారు. ఇందులో మీకు నచ్చిన యాప్ ఓపెన్ చేసి My Account సెక్షన్‌లోకి వెళ్లి Master List ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ప్రయాణికుల పేరు, వయస్సు, లింగం, బెర్త్ వంటి వివరాలను సేవ్ చేసుకోవాలి. ఎంత మంది ప్రయాణికులు ఉంటే అంతమందివి కూడా ఎంటర్ చేసుకోవాలి. దీనివల్ల టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయకుండానే.. ఆటోమేటిక్‌గా ఒక్క క్లిక్‌తో ఎంటరై.. సమయం ఆదా అవుతుంది.
సరైన సమయంలో లాగిన్ అవ్వడం
తత్కాల్ బుకింగ్ టైమింగ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఏసీ కోచ్‌ల తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, స్లీపర్ కోచ్‌ల తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే ఇది స్టార్ట్ అవ్వడానికి కేవలం 2 నిమిషాల ముందు మాత్రమే లాగిన్ అవ్వాలి. రెండు నిమిషాల కంటే ముందుగానే యాప్ ఓపెన్ చేస్తే.. బుకింగ్ ప్రారంభం అయ్యే సమయానికి బ్యాక్ అయిపోతుంది.
ఆటో అప్‌గ్రేడేషన్ (Auto Upgradation)
టికెట్ బుకింగ్ చేసేటప్పుడు పేర్లు ఎంటర్ చేసిన తర్వాత.. ‘Consider for Auto Upgradation’ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలా బెటర్. దీని వల్ల స్లీపర్ టికెట్ బుకింగ్ చేసుకుని ఏసీ కోచ్‌లలో ఖాళీలు ఉంటే అందులో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.
Also Read : దసరాకు ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. APSRTC 5,261 స్పెషల్ బస్సులు
వాలెట్ (IRCTC eWallet)
టికెట్ బుకింగ్ సమయంలో IRCTC eWallet పాత్ర చాలా కీలకం. దీనివల్ల సమయం చాలా ఆదా అయి టికెట్ త్వరగా కన్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌లోని వాలెట్‌లో UPI, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కనీసం రూ. 100 నుండి ఎంతైనా డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల టికెట్‌ను త్వరగా బుక్ చేసుకోవచ్చు.









