Flipkart Big Billion Days Sale 2026
Flipkart Big Billion Days Sale 2026

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale 2026) అఫీషియల్‌గా ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఐఫోన్‌లు, ఏసీలు, మొబైల్ యాక్సెసరీలను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే లైఫ్‌స్టైల్ ప్రొడెక్టులు, మరిన్నింటిని కూడా ఆఫర్లు, డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సేల్‌లో ఐఫోన్లను.. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో మరింత తక్కువ ధరకే పొందొచ్చు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కూడా బిగ్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

Also Read : క్యాన్సర్ రోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ .. మోదీ సర్కార్ సంచలనం!

Flipkart సేల్‌లో IPhone 15 (128gb) చాలా తక్కువ ధరకు లభిస్తోంది. దీని అసలు ధర రూ.74,900 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.67,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సెస్, SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.4,350 వరకు తగ్గింపుపొందొచ్చు. అప్పుడు దీని ధర మరింత తగ్గుతుంది. ఇంకా రూ.45,050 వరకు బిగ్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత మొబైల్ కండీషన్ మెరుగ్గా ఉండాలి.

అంతేకాకుండా Flipkart Big Billion Days Sale 2026లో IPHONE 17, 17 ప్రో మ్యాక్స్ కూడా తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. అన్ని ఆఫర్లతో కలిపి చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు Samsung Galaxy S25 5G కూడా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఇది దాని ప్రారంభ ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అన్ని ఆఫర్లతో కలిపి ఈ సేల్‌లో దీన్ని కేవలం రూ.54,999లకే సొంతం చేసుకోవచ్చు. కాగా దీని అసలు ధర రూ.79,900గా ఉండేది.

అలాగే AC పై కూడా ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా సేల్ పేజీ ప్రకారం.. 1-టన్ ACని కేవలం రూ.22,990 ప్రారంభ ధరతో కొనుక్కోవచ్చు. ఇంకా విండో, స్ప్లిట్ AC ఆప్షన్‌లతో సహా అనేక రకాల ప్రొడెక్టులను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అందువల్ల ఎప్పట్నుంచో ఒక మంచి ఫోన్ లేదా ఏసీ కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశం.

Also Read : షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. 10 అడుగుల గుంతలోకి కారు!