Amazon Great Indian Festival Sale 2026
Amazon Great Indian Festival Sale 2026

Amazon Great Indian Festival Sale 2026 ప్రారంభమైంది. ఈ పండుగ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టీవీలు వంటి అనేక ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy S25 Ultra, Xiaomi 17, OnePlus Nord 6, Lava Bold N4 Pro వంటి భారీ బడ్జెట్ ఫోన్లను అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లతో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా 32-అంగుళాల నుండి 75-అంగుళాల సైజుల వరకు ఉన్న అనేక టీవీలపై భారీ ఆఫర్లు పొందొచ్చు.

ఇవి మాత్రమే కాకుండా Amazon Great Indian Festival Sale 2026 లో.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సక్షన్లపై వినియోగదారులకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ప్రైమ్ వినియోగదారులు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5%, నాన్-ప్రైమ్ వినియోగదారులు 3% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందుతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీనిపై నో కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. రూ.1,500 కంటే ఎక్కువ విలువ గల ప్రొడెక్టులపై అమెజాన్ పే లేటర్, పే ఇన్ 3 వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్ కింద కొనుక్కుంటే 10% క్యాష్‌బ్యాక్ కూడా వస్తోంది.

Also Read : కోహ్లీ-రోహిత్ వీపుపై ఆ డివైజ్ ఏంటి? అసలు సీక్రెట్ ఇదే!

ఇక స్మార్ట్‌ఫోన్ల డిస్కౌంట్ల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రూ.84,999 కే లభిస్తుంది. దీనిపై రూ.5,000 కూపన్ ఆఫర్ కూడా ఉంది. అలాగే iQOO 15R రూ.46,499, Xiaomi 17 రూ.59,999, OnePlus Nord 6 రూ.42,999, OnePlus Nord CE 6 రూ.33,999, శాంసంగ్ గెలాక్సీ A56 5G రూ.31,999 కే అందుబాటులో ఉన్నాయి. అలాగే శాంసంగ్ గెలాక్సీ Z Fold 7 5G రూ.1,29,999, Redmi 15C 5G Prime రూ.15,999, Lava Bold N4 Pro 5G రూ.13,999 కే కొనుక్కోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80% వరకు.. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్యాషన్, బ్యూటీ ప్రొడెక్టులపై 80% వరకు, గృహోపకరణాలపై 65% వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ఇంకా బైక్స్, స్పోర్ట్స్ ఐటెమ్స్, బొమ్మలపై 50% వరకు డిస్కౌంట్లు పొందొచ్చు.

అమెజాన్ లాంచ్‌ప్యాడ్ సైతం ఎంపిక చేసిన ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్‌లను అందిస్తోంది. అమెజాన్ కరిగర్, సహేలి కొన్ని ఉత్పత్తులపై 85% వరకు తగ్గింపులను అందిస్తున్నాయి. వీటితో పాటు ఈ సేల్‌లో గీజర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు సహా మరిన్నింటిని తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Also Read : కోహ్లీ-అనుష్క ఆ ఆశ్రమానికి వెళ్లేందుకు రూ.5 కోట్లు.. విరాట్ పై సంచలన ఆరోపణలు!