హైదరాబాద్‌లో కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న IRS అధికారి రాజీవ్ తంపులా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన తన నివాసంలోని నాలుగో అంతస్తు నుంచి దూకినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రాజీవ్ తంపులా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫిక్కీ క్యాస్కేడ్‌ కార్యక్రమంలోనూ రాజీవ్ తంపులా పాల్గొన్నారు. స్మగ్లింగ్‌, నకిలీ వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కస్టమ్స్‌ విభాగం పాత్రపై ఆయన మాట్లాడారు. కాగా రాజీవ్ తంపులా 2012 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ఆయన 2014లో చెన్నై సెంట్రల్ ఎక్సైజ్ జోన్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.