Japan Permanent Residency Rules 2026
Japan Permanent Residency Rules 2026

జపాన్‌లో జాబ్ చేస్తున్నారా? అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ న్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్! ఎందుకంటే జపాన్‌లో పర్మనెంట్ రెసిడెన్సీ.. పొందాలంటే కేవలం అక్కడ కొన్నేళ్లు ఉండటం, జాబ్ చేయడం మాత్రమే సరిపోదు. మీ ఇన్‌కమ్ ఎంత? భవిష్యత్తులో పెన్షన్ పరిస్థితి ఎలా ఉంటుంది? జపనీస్ లాంగ్వేజ్ ఎంతవరకు తెలుసు? ఇవన్నీ కూడా ఇప్పుడు మరింత కీలకం కానున్నాయి. దానికి తోడు పర్మనెంట్ రెసిడెన్సీకి సంబంధించిన ఫీ కూడా ఒక్కసారిగా భారీగా పెరిగింది. మరి జపాన్ ప్రభుత్వం ఎందుకు ఈ ఛేంజెస్ తీసుకొచ్చింది? కొత్త పిఆర్ రూల్స్‌లో అసలు ఏం మారింది? ముఖ్యంగా ఇండియన్స్‌కు ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.

జపాన్‌లో పర్మనెంట్‌గా సెటిల్ అవ్వాలని చాలామంది ఫారినర్స్ చూస్తుంటారు. ముఖ్యంగా జాబ్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం అక్కడికి వెళ్లినవాళ్లు.. కొన్నేళ్ల తర్వాత శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని ట్రై చేస్తుంటారు. పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ వచ్చినవాళ్లకి సాధారణ వర్క్ వీసాతో పోలిస్తే చాలా ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది. జాబ్ ఛేంజ్ విషయంలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇలాంటి శాశ్వత నివాసం కోసం ఇప్పుడు జపాన్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ ఛేంజెస్‌లో కొన్ని ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.. మరికొన్ని 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ముందుగా అందరినీ ఆశ్చర్యపరిచిన ఛేంజ్.. Fee హైక్. అక్టోబర్ 1న పర్మనెంట్ రెసిడెన్స్ పర్మిషన్ ఫీ 10 వేల యెన్ నుంచి 2 లక్షల యెన్ కు పెరిగింది. అంటే ఫీ ఏకంగా 20 టైమ్స్ పెరిగింది. భారత కరెన్సీలో ఇది సుమారు లక్షా 22 వేలు. అయితే ఈ అమౌంట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే చెల్లించేది కాదు. పర్మనెంట్ రెసిడెన్స్.. అప్రూవ్ అయినప్పుడు పర్మిషన్ ఫీగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక ఎలిజిబిలిటీస్ ఉన్నవారికి ఫీ రిడక్షన్ ప్రొవిజన్ ఉంది. ఇలాంటి కేసెస్ లో పిఆర్ ఫీ 20 వేల యెన్ వరకు తగ్గించొచ్చు.

Also Read : అంతరిక్షంలో అణుకేంద్రాలు.. అమెరికా, చైనా, రష్యా వ్యూహం ఏంటో తెలుసా?

అసలు ప్రభుత్వం ఫీ ఎందుకు పెంచింది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. జపాన్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రకారం.. ఫారినర్స్ కి సంబంధించిన ఎంట్రీ, రెసిడెన్స్ మేనేజ్‌మెంట్ ను మరింత ఎఫెక్టివ్‌గా మేనేజ్ చేయడానికి అయ్యే ఖర్చులు, పిఆర్ అప్లికేషన్స్‌ను ఎగ్జామిన్ చేయడానికి అయ్యే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్, అలాగే ఇతర దేశాల్లో ఉన్న సిమిలర్ ఫీస్ వంటి ఫ్యాక్టర్స్‌ను కన్సిడర్ చేసి Feeను పెంచారు. అంటే కేవలం పిఆర్ ఫీ మాత్రమే కాదు.. రెసిడెన్స్ స్టేటస్ ఛేంజ్, వీసా రెన్యూవల్ వంటి కొన్ని అధర్ ఇమిగ్రేషన్ ప్రొసీజర్స్ కు కూడా ఫీస్ పెరిగాయి.

ఇక అసలు ఇంపార్టెంట్ విషయం పిఆర్ ఎలిజిబిలిటీ రూల్స్. కొత్త గైడ్‌లైన్స్ లో ఇన్‌కమ్‌పై మరింత క్లియర్ క్రైటీరియా పెట్టారు. ఇప్పటివరకు అప్లికెంట్ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్నాడా? తన జీవితం తానే మేనేజ్ చేసుకోగలడా? అనే అంశాలు చూసేవారు. ఇప్పుడు హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్‌ను కూడా మరింత స్పెసిఫిక్ గా ఎవాల్యుయేట్ చేయనున్నారు. అంటే ఒక వ్యక్తి ఇన్‌కమ్ మాత్రమే కాకుండా.. అతని హౌస్‌హోల్డ్ సైజ్ కి సరిపోయే జపనీస్ హౌస్‌హోల్డ్స్ యావరేజ్ ఇన్‌కమ్‌తో పోల్చి చూస్తారు. ఆ ఇన్‌కమ్ లెవెల్ ను కంటిన్యూయస్‌గా మెయింటైన్ చేస్తున్నారా అనే విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తారు.

ఫర్ ఎగ్జాంపుల్.. ఒక ఫారినర్ జపాన్ లో జాబ్ చేస్తున్నాడనుకుందాం. అతనితో పాటు వైఫ్, చిల్డ్రన్ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు పిఆర్ అసెస్మెంట్ లో ఫ్యామిలీ సైజ్ ను కూడా కన్సిడర్ చేసి.. ఆ సైజ్ ఉన్న జపనీస్ హౌస్‌హోల్డ్స్ యావరేజ్ ఇన్‌‌కమ్‌తో పోల్చిచూస్తారు. అంటే అప్లికెంట్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్‌ను కూడా జపాన్ వాళ్ల ఫ్యామిలీతో కంపేర్ చేస్తారు. అయితే ఈ ఫిక్స్డ్ యూనివర్సల్ శాలరీ నంబర్ అందరికీ ఒకటే అని కాదు. హౌస్‌హోల్డ్ సైజ్, అక్కడున్న పరిస్థితులను బట్టి అసెస్మెంట్ ఉంటుంది.

ఇక మరో మేజర్ ఛేంజ్.. పెన్షన్. జపాన్ లో పనిచేస్తున్న ఫారినర్ పెన్షన్ సిస్టమ్‌లో ఎంతకాలం ఉన్నారు? వారి కాంట్రిబ్యూషన్ హిస్టరీ ఎలా ఉంది? ఇప్పటి ఇన్‌కమ్ ఆధారంగా ఫ్యూచర్‌లో ఎంత పెన్షన్ వచ్చే అవకాశం ఉంది? అనే విషయాలను కూడా పిఆర్ అసెస్మెంట్ లో కన్సిడర్ చేయనున్నారు. అంటే “ఇప్పుడు మంచి శాలరీ ఉంది కాబట్టి సరిపోతుంది” అనే అప్రోచ్ మాత్రమే కాకుండా.. ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చూస్తారు. అవసరమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీని అసెస్ చేసేటప్పుడు అప్లికెంట్ దగ్గరున్న అసెట్స్, సేవింగ్స్ వంటి అంశాలు కూడా రెలవెంట్ కావచ్చు.

Also Read : ఉక్రెయిన్‌లో భారతీయ కంపెనీపై రష్యా దాడి.. రూ.400 కోట్ల నష్టం!

ఇక ఫారినర్స్ లో చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే మరో ఛేంజ్.. జపనీస్ లాంగ్వేజ్. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం పిఆర్ కోసం అప్లికెంట్ కు సర్టెన్ లెవెల్ ఆఫ్ జపనీస్ లాంగ్వేజ్ ఎబిలిటీ ఉందా అనే విషయాన్ని కన్సిడరేషన్ ఫ్యాక్టర్ గా తీసుకుంటారు. స్పెసిఫిక్ గా బి1 లెవెల్ లేదా అబవ్ జపనీస్ ఎబిలిటీని కన్సిడర్ చేస్తారు. బి1 అంటే బేసిక్ వర్డ్స్ మాట్లాడటం మాత్రమే కాదు.. ప్రతిరోజు లైఫ్, వర్క్, సోషల్ సిచువేషన్స్ లో రీజనబుల్ గా కమ్యూనికేట్ చేయగల ఇంటర్మీడియట్ -లెవెల్ లాంగ్వేజ్.

అయితే ఇక్కడ కూడా అందరికీ ఒకే రూల్ అప్లై చేయరు. హైలీ స్కిల్డ్ ఫారైన్ నేషనల్స్, వారి ఫ్యామిలీ మెంబర్స్, జపాన్ లో కొన్ని ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినవాళ్లు, కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ లో ఉన్నవాళ్లకు బి1 జపనీస్ రిక్వైర్‌‌మెంట్ ను కన్సిడర్ చేయకపోవచ్చని గైడ్‌లైన్స్ లో ఎక్సెప్షన్స్ ఇచ్చారు.

2027 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త పిఆర్ గైడ్‌లైన్స్ పూర్తి స్థాయిలో అప్లికేషన్స్ కు అప్లై అవుతుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇన్‌కమ్, పెన్షన్, జపనీస్ లాంగ్వేజ్ వంటి ఛేంజెస్ మరింత క్లియర్ గా అసెస్మెంట్ లో భాగం కానున్నాయి. అయితే ఒక విషయం మాత్రం ఇప్పటికీ చాలా మందికి కీలకం. సాధారణ పిఆర్ రూట్ లో జపాన్ లో కంటిన్యూయస్‌గా 10 ఇయర్స్ రెసిడెన్స్ అనే బేసిక్ రిక్వైర్‌మెంట్ కొనసాగుతోంది. ఆ 10 ఇయర్స్ లో సాధారణంగా కనీసం 5 ఇయర్స్ వర్కింగ్ లేదా క్వాలిఫైయింగ్ రెసిడెన్సీ స్టేటస్ లో ఉండటం వంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే పర్మనెంట్ రెసిడెంట్ స్పౌజ్, హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వంటి కొన్ని కేటగిరీస్ కు షార్టర్ రూట్స్, స్పెషల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి.

ఇక జపాన్ లో ఫారెన్ రెసిడెంట్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అందుకే ఇమిగ్రేషన్ సిస్టమ్‌ను మరింత స్ట్రక్చర్డ్‌గా మేనేజ్ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెంచుతోంది. పిఆర్ గైడ్‌లైన్స్‌లో ఇన్‌కమ్, పెన్షన్, టాక్స్ అండ్ పబ్లిక్ ఆబ్లిగేషన్స్, జపనీస్ లాంగ్వేజ్, జపనీస్ సిస్టమ్స్ అండ్ రూల్స్ పై అండర్‌స్టాండింగ్ వంటి అంశాలను కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారు. అంటే జపాన్ లో లాంగ్-టర్మ్ గా సెటిల్ అవ్వాలనుకునే ఫారినర్ నుంచి కేవలం జాబ్ ఉండటం మాత్రమే కాకుండా.. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సోషల్ ఇంటిగ్రేషన్, పబ్లిక్ ఆబ్లిగేషన్స్ వంటి విషయాల్లో కూడా కన్సిస్టెంట్ రికార్డ్ ఉండాలని కొత్త ఫ్రేమ్‌వర్క్ చూపిస్తోంది.

ఇక్కడ ఇండియన్స్ కు మరో ప్రాక్టికల్ పాయింట్ ఉంది. జపాన్ లో ప్రస్తుతం ఇండియన్ ప్రొఫెషనల్స్, ఐటీ వర్కర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్ ఇలా చాలా కేటగిరీస్ లో ఇండియన్స్ ఉంటున్నారు. వారిలో ఫ్యూచర్ లో పిఆర్ తీసుకోవాలని చూస్తున్నవాళ్లు.. ఇప్పటి నుంచే తమ ఇన్‌కమ్ రికార్డ్స్, టాక్స్ పేమెంట్స్, పెన్షన్ కాంట్రిబ్యూషన్స్, రెసిడెన్స్ హిస్టరీ, జపనీస్ లాంగ్వేజ్ స్కిల్స్ విషయంలో ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే పిఆర్ అసెస్మెంట్ లో ఇవన్నీ రెలవెంట్ ఫ్యాక్టర్స్ గా మారుతున్నాయి.

కాబట్టి జపాన్‌లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నా.. లేదా ఫ్యూచర్ లో జపాన్ కి వెళ్లి అక్కడే పర్మనెంట్‌గా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నా.. ఈ ఛేంజెస్ ను ముందుగానే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 2026 అక్టోబర్ 1 నుంచి పిఆర్ ఫీ 2 లక్షల యెన్, అలాగే 2027 ఏప్రిల్ 1 నుంచి రివైజ్డ్ పిఆర్ గైడ్‌లైన్ ప్రధానంగా అమల్లోకి రానుండటంతో.. జపాన్ లో లాంగ్-టర్మ్ సెటిల్‌మెంట్ ప్లాన్ చేసుకునేవాళ్లు కొత్త రూల్స్ ను కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోవాలి.