Washing Machine Offer

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkartలో వాషింగ్ మెషీన్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. చిన్న చిన్న కుటుంబాలకు సరిపడా ఈ ప్రొడెక్ట్ అతి తక్కువ ధరకే పొందొచ్చు. అంతేకాకుండా భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే ఎక్స్ఛేంజ్ తగ్గింపులు కూడా లభిస్తున్నాయి. అందువల్ల ఎప్పట్నుంచో ఒక మంచి Washing Machine కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదే సరైన అవకాశం. ఇప్పుడు ఈ ప్రొడెక్టుకు సంబంధించిన ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Flipkart లో Kenstar 6 kg 5Star Rated Washing Machine అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు రూ.11,990 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.7,290లకే అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. అలాగే రూ.4,050 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. వాషింగ్ మెషీన్‌ను కేవలం రూ.3,240లకే సొంతం చేసుకోవచ్చు.

ఇది 6 కేజీల 5-స్టార్ రేటింగ్‌తో వస్తుంది. మెరూన్, వైట్ కలర్‌లలో లభిస్తుంది. ఇందులో 1350 RPM వేగంతో పనిచేసే మోటార్ ఉంది. అలాగే 5-స్టార్ BEE రేటింగ్, 350 వాట్ల పవర్ వినియోగంతో విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది. అంతేకాకుండా పాలిప్రొప్రొపీన్ మెటీరియల్‌తో రూపొందించిన టబ్ ఎక్కువ కాలం ఉంటుంది.

Also Read : ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌.. VIVO ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్.. బెస్ట్ మొబైల్స్ ఇవే..!

బాక్స్‌లో లభించే వస్తువులు

1 x వాషింగ్ మెషిన్ యూనిట్, 1 x యూజర్ మ్యాన్యువల్, 1 x ఇన్‌లెట్ పైప్, 1 x స్పిన్ డ్రై సేఫ్టీ లిడ్, 1 x డ్రెయిన్ పైప్, 1 x డ్రెయిన్ పైప్ స్నాప్, 1 x ర్యాట్ మెష్ కవర్ ఉన్నాయి.

Also Read : గుండెపగిలే విషాదం: అంబులెన్స్‌లో వస్తుండగా ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి