
IRGC : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్ర ఆరోపణలు చేసింది. యుద్ధం విషయంలో అమెరికా ప్రజలను ట్రంప్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అమెరికన్లకు పిలుపునిచ్చింది. అమెరికా రాజకీయ వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో ప్రజలు మేల్కొని తమ చేతుల్లోకి నియంత్రణ తీసుకోవాలని IRGC కోరింది.
అమెరికా ప్రజలను ఉద్దేశించి IRGC మంగళవారం 25 పేజీల బహిరంగ లేఖ విడుదల చేసింది. ఇందులో ట్రంప్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించింది. త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ వెలువడటం గమనార్హం. అమెరికా-ఇరాన్ యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించిన సమయంలో ఈ లేఖ వచ్చింది. అమెరికా ప్రజలు, ఇరాన్ ప్రజలు రాజకీయ నాయకుల నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని IRGC పేర్కొంది. వైట్‌హౌస్‌లోని రాజకీయ నేతల వల్ల ఇరు దేశాల ప్రజలు నష్టపోతున్నారని చెప్పింది. తాము అమెరికా ప్రజలకు వ్యతిరేకం కాదని, అమెరికా రాజకీయ వ్యవస్థలోని విధానాలనే వ్యతిరేకిస్తున్నామని లేఖలో వివరించింది.
Also Read : ఏపీలో ఇరుముడి సినిమా రిపీట్.. అక్కడ టీచర్.. ఇక్కడ వంటి మనిషి!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల విషయంలోనూ IRGC కీలక వ్యాఖ్యలు చేసింది. వేల సంఖ్యలో బాంబులు, క్షిపణులతో ఇరాన్‌లోని ప్రభుత్వ భవనాలు, నివాస ప్రాంతాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, కొన్ని సైనిక స్థావరాలపై దాడులు చేసినప్పటికీ.. తమ లక్ష్యాలను పూర్తిగా సాధించలేకపోయాయని పేర్కొంది. అణు పరిశ్రమకు సంబంధించిన కొన్ని భవనాలు, కొన్ని వైమానిక రక్షణ కేంద్రాలు దెబ్బతిన్నాయని మాత్రం అంగీకరించింది.
ఈ యుద్ధంలో ఇరాన్‌దే పైచేయి అని IRGC తన లేఖలో ప్రకటించింది. అయితే ఇది IRGC చేసిన ప్రకటన మాత్రమే. మరోవైపు ట్రంప్ మాత్రం ఇరాన్ తీవ్రంగా నష్టపోతోందని చెబుతున్నారు. మరోవైపు హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి ఇరాన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ ఇటీవల తిరస్కరించారు. ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ తీవ్రంగా నష్టపోతున్నందుకే ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read : అమెరికా – ఇరాన్ వార్‌లో సంచలనం.. యుద్ధంలోకి ఇరాన్ మహిళలు?









