
Asian Games 2026 : ఆసియా క్రీడల కబడ్డీలో మన అమ్మాయిలు, అబ్బాయిలు రాణించారు. ఇరు జట్లు ఇరాన్‌ను గట్టిగానే ఎదుర్కొన్నారు. మొదట ఆ దేశాన్ని ఓడించి మహిళల జట్టు స్వర్ణాన్ని దక్కించుకోగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో నడిచింది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో బంగారు పతకాన్ని సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఇరాన్‌ను 40-34 పాయింట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. దీంతో కలిపి ఆసియా క్రీడల చరిత్రలో కబడ్డీ జట్టు తొమ్మిదిసార్లు బంగారు పతకాన్ని సొంతం చేసుకోవడం విశేషం.. 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కావడం గమనార్హం. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మెన్ ఇన్ బ్లూ’ మరో విజయంతో తొమ్మిదో పుత్తడిని చేజిక్కించుకుంది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఇరాన్‌ను చిత్తు చేసిన అనంతరం భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాన్ని చేబూని మ్యాట్‌పై పరుగు పెట్టారు. విజయానందంలో జట్టు సభ్యులు, కోచ్‌లు ఆనందంతో గంతులు వేశారు.
జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు తమ ప్రతిభను చాటాయి. కబడ్డీ కూతలో.. ఉడుం పట్టులో తమకు తిరుగులేదని చెబుతూ మహిళలు, పురుషుల విభాగంలో స్వర్ణ పథకాల్ని కైవసం చేసుకున్నాయి. శనివారం ఫైనల్లో ఇరాన్‌ను చిత్తు చేసి మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించగా.. కాసేపట్లోనే పురుషుల జట్టు సైతం పసిడిని ఒడిసిపట్టింది. ఫైనల్లో 40-34తో ఇరాన్‌ను ఓడించిన మెన్ ఇన్ బ్లూ గోల్డ్ మెడల్ అందుకుంది.
Also Read : పాక్ ప్రధానికి కౌంటర్ ఇచ్చిన పేటల్ గహ్లోత్ ఎవరు?
రెండో అర్ధ భాగంలో..
తొలి అర్ధ భాగంలో 17-18తో వెనకడిన భారత్.. అనంతరం మ్యాచ్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంది. కెప్టెన్, రైడర్ సునీల్ కుమార్ ఇరాన్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ పాయింట్లు తీసుకు వచ్చాడు. దాంతో.. ఇప్పటికే ఎనిమిది సార్లు ఆసియాడ్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి స్వర్ణాన్ని పట్టేసింది.
భారత పురుషుల జట్టు తొలిసారి బీజింగ్ (1990)లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 1994(హిరోషియా), 1998(బ్యాంకాక్), 2002(బుసాన్), 2006(దోహా), 2010(గంగ్జౌ), 2014(ఇంచియాన్), 2023(హంగ్జౌ), ఇప్పుడు నగోయలో బంగారు పథకాన్ని పొందింది. అంతకుముందు పుష్ప రానా సారథ్యంలోని మహిళల జట్టు ఇరాన్‌ను 37-34తో ఓడించింది. తద్వారా ఆసియా క్రీడల్లో నాలుగో స్వర్ణం సొంతం చేసుకున్న జట్టుగా నిలిచింది.
Also Read : అమెరికా సై అంటేనే పోరుకు ఎండ్ కార్డ్.. వార్‌పై ఇరాన్ ప్రెసిడెంట్ క్లారిటీ!
పతకాల పట్టికలో 10వ స్థానం..
కాగా, 2026 ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలతో భారత్ పతకాల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. 11 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ ఫైనల్లో హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయంతో తొలి స్వర్ణాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్, కమల్జీత్ జంట శుక్రవారం పసిడి సొంతం చేసుకున్నారు. ఇక, శనివారం కబడ్డీలో రెండు స్వర్ణాలు వచ్చాయి.









