BIG BREAKING :  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన తెలంగాణ హైకోర్టు తీర్పును సెప్టెంబర్‌ 18న వెల్లడించనున్నట్లు ముందుగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 16న వెలువడాల్సిన తీర్పును కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అతనిపై అనర్హత వేటు వేస్తూ సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గతంలో తిరస్కరించారు. దానం నాగేందర్‌ పార్టీ మారినట్లు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్‌ తన నిర్ణయంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్నే సవాల్‌ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఈసీకి సమాచారం ఇచ్చింది.

ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి చెంపదెబ్బ. బీఆర్‌ఎస్‌ పార్టీకి విజయం లభించింది అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని తాము గతంలోనే చెప్పామని తెలిపారు.

హైకోర్టు ఈ తీర్పుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను గౌరవనీయ హైకోర్టు ఈరోజు అనర్హుడిగా ప్రకటించింది. మిగిలిన ఫిరాయింపుదారులకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.