
Sea In Argentina : నిన్న మొన్నటి వరకు సముద్రం ఉన్న చోట ఒకసారిగా నేల కనిపిస్తే..సముద్రపు అలలతో హోరెత్తించే చోట సముద్రపు అడుగుభాగం దర్శనమిస్తే అవక్కావ్వాల్సిందే కదా.. అర్జెంటీనాలో ఇప్పుడు ఇదే వింత పరిణామం చోటు చేసుకుంది. అక్కడి అట్లాంటిక్ మహా సముద్రం రాత్రికి రాత్రే మాయమై పోయింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇలాగే జరుగుతుందని సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం సాగుతోంది. సముద్రం ఉండాల్సిన చోట నౌకలు, ఇసుక దర్శనమిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సముద్రం ఒకటి రెండు కాదు ఏకంగా 23 కిలోమీటర్లు వెనక్కు వెళ్లడంతో స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో అక్కడ సముద్రం ఎండిపోతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిజంగానే సముద్రం వెనక్కి వెళ్లిందా? అక్కడి నీరు ఎండిపోతుందా? వైరల్ అవుతున్న వీడియోల్లో వాస్తవమెంత ? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Also Read : పుతిన్ ఆరస్ Vs జిన్‌పింగ్ హాంగ్‌చీ.. ఇద్దరిలో ఎవరి కార్ బెస్ట్? ఎవరి కారు ఎక్కువ సేఫ్?
Argentina’s Sea “Disappears” The Real Reason Behind the Shocking Retreat! 😢😲 pic.twitter.com/n2qPtDBVzU
— The MES Times (@themestimes) September 11, 2026
అర్జెంటీనా దేశంలోని బ్యూనస్ ఎయిర్ ప్రావిన్స్‌లో గల మార్ డెల్ ప్లాటా తీరంలో సముద్రం రాత్రికి రాత్రే 23 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. సముద్రం లో నీరులేకపోవడంతో ఇసుక నేలపై ఓడలు ఉన్న దృశ్యాలు స్పష్టంగా కన్పించాయి. నీరు లేక కొన్ని చేపలు కూడా చనిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సంబంధిత దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొందరు యూజర్లు.. ‘సముద్రం ఎండిపోయింది.. ఇది ప్రకృతి విపత్తు’ అంటూ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో ఆ దృశ్యాలను చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వాటిని షేర్ చేయడంతో ఇది విపరీతంగా వైరల్ అయ్యింది.
The sea vanished without a sound. Ships that once floated now lean helpless on cracked mud, their hulls tilted under an empty sky. No waves. No warning. Only the wet silence of a world the ocean abandoned and the quiet dread of whatever comes next when the water decides to… pic.twitter.com/v0PO6g2bqK
— Arif Dawood (@aridwd) September 10, 2026
ఈ విషయమై అర్జెంటీనా జాతీయ మీడియా సంస్థ స్పందిస్తూ ఒక కథనం ప్రచురించింది. ఈ తీరంలో సముద్రం వెనక్కి వెళ్లిపోయిన మాట వాస్తవమే గానీ.. శాశ్వతంగా ఎండిపోతోందనే వాదన సరికాదని తేల్చి చెప్పింది. ‘‘ఇది విపత్తు కాదు.. వాతావరణ మార్పుల వల్ల తాత్కాలికంగా చోటుచేసుకున్న ఓ సహజసిద్ధ ప్రక్రియ అని వెల్లడించింది. ఇక్కడ నీటిమట్టం అకస్మాత్తుగా తగ్గడం వల్ల.. సాధారణంగా అలల కింద దాగి ఉండే రాతి, ఇసుక నిర్మాణాలు బయటకు కన్పించాయి. దాన్ని చూసిన పర్యాటకులు కొత్త దీవిగా భావించారు’’ అని కథనం లో రాసుకొచ్చింది. ఇదంతా సాధారణ ఆటుపోట్ల చక్రంలో భాగమేనని, కొద్ది గంటల్లోనే తీరంలో నీటిమట్టం సాధారణ స్థితికి చేరుకుందని వివరణ ఇచ్చింది. నిజానికి సముద్రం ముందుకు వెనక్కి కదలడం సహజమే. చంద్రుడి గురుత్వాకర్షణ, సూర్యుడి ప్రభావం, గాలుల వేగం, సముద్ర ప్రవాహాలు, స్థానిక భౌగోళిక పరిస్థితుల కారణంగా టైడ్స్ (ఆటుపోట్లు) ఏర్పడడం సహజం. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఆటుపోట్ల సమయంలో సముద్రం గణనీయంగా వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తుంది. అయితే అర్జెంటీనాలో ఏకంగా 23 కిలోమీటర్లు సముద్రం వెనక్కు వెళ్లడం కొంత ఆసక్తిని రేకెత్తించింది.
Also Read : రష్యా ఆయిల్ టూ మిసైల్స్.. ఢిల్లీ వేదికగా మోదీ-పుతిన్ భేటీ.. ప్రపంచం కళ్లన్నీ భారత్ వైపే!
🚨 SHOCKING SCENE IN ARGENTINA 🌊
– The sea reportedly moved 23 KM away within an hour, leaving boats stranded and fish dead. What caused this? 👀#WDNews #argentina #ROSÉ #9Sept pic.twitter.com/eAGJZT2uEn
— World Digital News (@WorldDigital431) September 9, 2026
వాస్తవమిదే.
కాగా ఇలా జరగడానికి కారణాలను సముద్రరంగ అధ్యయనకారులు విశ్లేషించారు. ‘‘ఒక్కోసారి నిరంతరంగా వీచే బలమైన గాలుల కారణంగా.. ఓ అదృశ్య గోడ ఏర్పడి అది తీరం నుంచి నీటిని వెనక్కి నెట్టేస్తుందని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది. దీనిని విండ్ సెట్‌డౌన్ లేదా లో టైడ్ సైకిల్‌గా పిలుస్తారని వెల్లడించారు. ఉప్పెన, తుపాను లాంటి వాటికి ఇది పూర్తిగా వ్యతిరేక చర్య’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు సునామీ వస్తుందేమోనని చాలా మంది భయపడుతారు. కానీ, అలా జరగదని నిపుణులు స్పష్టం చేశారు.
‘‘సముద్ర గర్భంలో భూకంపాల వంటివి సంభవించినప్పుడు సునామీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు కొద్ది క్షణాల పాటు తీరం నుంచి నీరు వెనక్కి వెళ్లిన నీరు ఆ వెంటనే రాకాసి అలలుగా విరుచుకుపడతాయి. కానీ, ఈ పరిస్థితి విభిన్నం. ఇక్కడ నీరు తీరం నుంచి దూరంగా వెళ్లి.. కొద్ది గంటల తర్వాత మళ్లీ పునఃస్థితికి చేరుకుంటుంది’’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.









