Osama Bin Laden : విమానాలను హైజాక్‌ చేసి అమెరికాలో 2001లో 9/11 దాడులు చేసి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఆల్‌ఖైదా ఘటన నేటికి ఎవరూ మరిచిపోరు. నాటి దాడిలో అనేక మంది మరణించారు. అయితే ఈ ఘటన జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు అఫ్గానిస్థాన్‌కు చెందిన నార్తర్న్‌ అలియన్స్‌ నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌ హత్య జరిగింది. ఈ హత్య అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే మొదట ఈ హత్య ఎవరు చేశారో తెలియకపోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన 9/11 దాడుల అనంతరం జరిగిన దర్యాప్తులో ఈ ఘటన వెనుక కూడా అల్‌ఖైదా హస్తం ఉన్నట్లు అమెరికా గుర్తించింది. అయితే అతన్ని చంపాల్సిన అవసరం ఆల్ ఖైదా లేకపోయినప్పటికీ కేవలం తాలిబన్ల మెప్పు కోసమే నాడు ఒసామా బిన్‌ లాడెన్‌ ఈ హత్యకు ప్లాన్ వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read : షేక్ హసీనా కుమార్తె సంచలన నిర్ణయం.. WHO పదవికి రాజీనామా!

అహ్మద్‌ షా మసూద్‌.. అఫ్గానిస్థాన్‌ నార్తర్న్‌ అలియన్స్‌కు నాయకత్వం వహించేవాడు. తాలిబన్ల కు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్‌లో జరిగిన తిరుగుబాటుదారుల పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. దీంతో అతను తాలిబన్లకు ప్రత్యర్థిగా మారాడు. 2001 సెప్టెంబరు 9న మసూద్‌ పంజ్‌శీర్‌ లోయలోని తన క్యాంప్‌లో ఉండగా ఆయనను దారుణంగా హత్య చేశారు. ఆనాడు బెల్జియం టీవీ జర్నలిస్టులుగా మారువేషంలో వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన ఇంటర్వ్యూ కోసమని చెప్పి ఆయన వద్దకు వచ్చారు. తమ వీడియో కెమెరాల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఆయన వద్దకు చేరిన దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అయితే మసూద్‌ హత్యను నార్తర్న్‌ అలయన్స్‌ సెప్టెంబరు 15 వరకు బయటపెట్టకపోవడం గమనార్హం.

అయితే తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన హత్యపై పలు అనుమానాలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత అగ్రరాజ్యం ఈ ఘటనపై దర్యాప్తు జరపగా.. హత్య వెనుక లాడెన్‌ హస్తం ఉన్నట్లు బయటపడింది. అమెరికాలో 9/11 దాడుల తర్వాత అమెరికా నుంచి భీకర ప్రతిస్పందన ఎదురవుతుందని లాడెన్‌ ముందే అంచనా వేశాడు. అగ్రరాజ్యం దాడుల బారి నుంచి రక్షించుకునేందుకు.. తాలిబన్ల సాయం తీసుకోవాలని లాడెన్‌ ఫక్కా వ్యూహం పన్నాడు. అందులో భాగంగానే తాలిబన్ల ప్రత్యర్థి అయిన మసూద్‌ను హతమార్చినట్లు దర్యాప్తులో తెలిసింది. మసూద్‌ హత్య జరిగిన రోజే.. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్ చీఫ్‌ జనరల్‌ మహమూద్‌ అహ్మద్‌తో అమెరికా సీఐఏ నాటి డైరెక్టర్‌ జార్జ్‌ ట్రెంట్‌ సమావేశమవడం గమనార్హం. ఆ సమయంలో అల్‌ఖైదా, తాలిబన్ల గురించి వీరు చర్చించుకున్నట్లు తెలిసింది. లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబన్ల సాయం తీసుకోవాలని నాడు పాక్‌ నిఘా అధికారి అమెరికాకి సలహా కూడా ఇచ్చారట.

అమెరికాలో అల్‌ఖైదా తీవ్రవాదులు 2001 సెప్టెంబరు 11న భీకర ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ మారణహోమం జరిగి ఈ ఏడాదికి ఇరవై ఐదేళ్లు కావొస్తోంది. నాటి భీకర దాడుల్లో దాదాపు 3వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయ తెలిసిందే. దీనికి ప్రతీకారంగా 2011లో అమెరికా కీలక ఆపరేషన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో దాక్కొన్న లాడెన్‌కు హతమార్చిన విషయం తెలిసిందే.

Also Read : బంగ్లాదేశ్లో పేలిన యుద్ధ ట్యాంక్.. మేడ్ ఇన్ చైనా పీస్ అంటూ నెటిజన్ల ట్రోల్స్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.