
Pakistan : సౌదీ అరేబియా పై హూతీ తిరుగుబాటు దారులు తీవ్ర స్థాయిలో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సౌదీలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈక్రమంలో ఇటీవల పాకిస్థాన్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాల మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందం చర్చనీయంశంగా మారింది. కొత్తగా ఏర్పడిన మక్కా రక్షణ కూటమిలోని ముగ్గురు సభ్యులలో ఎవరిపై దాడి జరిగినా అందరిపై దాడిగా పరిగణిస్తామని ఆయా దేశాలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సౌదీ అరేబియాపై హూతీలు జరిపిన దాడి విషయంలో ఇటు పాకిస్థాన్, అటు తుర్కియే ఏ మాత్రం జోక్యం చేసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదురువుతున్నాయి. ఈ క్రమంలో ఆలస్యంగా తేరుకున్న పాకిస్థాన్ హూతీలకు హెచ్చరికలు జారీ చేసింది. సౌదీలో దాడులు విస్తరిస్తే.. మక్కా ఒప్పందం యాక్టివేట్ అవుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించడం గమనార్హం. నూతనంగా ఏర్పడిన మక్కా రక్షణ కూటమిలోని ముగ్గురు సభ్యులలో ఎవరిపై దాడి జరిగినా.. దానిని అందరిపై దాడిగా పరిగణిస్తామని, ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ఆసిఫ్ తీవ్రంగా హెచ్చరించాడు.
సౌదీ లోని అభా, జాజన్, నిజ్రన్, ఖామిస్ ముషైత్ నగరాలను లక్ష్యంగా చేసుకుని హూతీలు మంగళవారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మొత్తం 73 మంది గాయపడ్డారని హూతీ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. గాయపడ్డ వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. ఈ దాడుల కారణంగా సౌదీలోని పలు చమురు క్షేత్రాల్లో మంటలు కూడా చెలరేగినట్లు తెలిపింది. అయితే యెమెన్‌లోని జవఫ్ ప్రావిన్సులో ఉన్న కారాగారంపై సౌదీ చేసిన వైమానిక దాడికి ప్రతికారంగానే ఈ దాడులు చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఆసిఫ్ మాట్లాడుతూ ‘‘ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాలు తమంతట తాముగా మరో దేశంపై దాడి చేయడానికి వీలు లేదు. కానీ ఒక సభ్య దేశంపై మరో ఇతర దేశం దురాక్రమణకు పాల్పడితే మాత్రం. మిగిలి దేశలు వెంటనే ప్రతిస్పందిస్తాయి. మేము ఈ ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. అవసరమైనప్పుడు వాటిని గౌరవిస్తాం’’ అని పాకిస్థాన్‌పేర్కొన్నారు.
Also Read : సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడి.. 73 మందికి గాయాలు..
మక్కా ఒప్పందం నిలిచేనా?
కాగా మక్కా ఒప్పందం ఎంతవరకు నిలుస్తుందనేది ప్రశ్నార్థకమే. ఇందులోని మూడు దేశాలు మూడు భిన్న ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అందులో పాకిస్థాన్ అణ్వస్త్ర దేశం, తుర్కియే నాటో సభ్య దేశం. అలాగే చమురు నిల్వలతో సుసంపన్నమైనది సౌదీ అరేబియా. ఈ మూడు దేశాల మధ్య కుదిరిన సంయుక్త రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. కాగా ఇరాన్ యెమెన్‌లో హూతీలకు, లెబనాన్‌లో హెజ్‌బొల్లాలకు, గాజాలో హమాస్‌కు, ఇరాక్‌లో షియా మిలీషియాలకు మద్దతిస్తున్నది. దీంతో ఇరాన్‌ను ఒంటరి చేసి దాన్ని నిలువరించేందుకే ఈ కూటమి ఏర్పడిందనే ప్రచారం సాగతోంది. అలాంటి మక్కా కూటమికి తొలి పరీక్షగా హూతీల దాడులు నిలిచాయి. ఈ దాడులపై ఇప్పటివరకు పాకిస్థాన్ మాత్రమే ఖండించింది. ఆసిఫ్ హెచ్చరికలు చేసినప్పటికీ.. ఈ ఒప్పంద రక్షణ కట్టుబాట్లను నెరవేర్చడంలో ఈ దేశం ఏమేరకు సిద్ధంగా ఉందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read : ఇరాన్‌పై గెలిస్తే పెట్రోల్ ధరలు భారీగా తగ్గుతాయ్: ట్రంప్ సంచలన ప్రకటన!









