
Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అధిష్టానం ఆమెను తన పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలస్తోంది. అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన సురేఖకు అక్కడ ఢిల్లీ నాయకుల అపాయింట్ మెట్ కూడా దొరకలేదని తెలుస్తోంది. మొదట ఆమెను అధిష్టానం ఢిల్లీకి రావాలని ఆహ్వానించినట్లు ప్రచారం సాగినప్పటికీ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తనపై వేటు తప్పదన్న ఆలోచనలో సురేఖ పార్టీ పెద్దలను కలిసి వివాదానికి సంబంధించిన అంశాలపై చర్చించాలనుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలను కలవాలని ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు కేసీ వేణుగోపాల్ ఇంతవరకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : మోదీ కీలక పిలుపు: విదేశాలకు వెళ్లొద్దు.. బంగారం కొనొద్దు!
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సురేఖకు హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి క్యూ కట్టారు. కొండాపై వేటే లక్ష్యంగా వీరంతా ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ AICC చీఫ్ ఖర్గే, KC వేణుగోపాల్‌తో సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మీద క్రమశిక్షణ కమిటీ నివేదికపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖర్గే, KC వేణుగోపాల్‌తో భేటీ అయ్యేందుకు కొండా సురేఖ ప్రయత్నిస్తు్న్నారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి బుజ్జగించేందుకు కొండా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్‌ను డీల్ చేస్తే లోకల్లో నెగ్గుకు రావాచ్చని కొండా ప్లాన్ చేస్తు్న్నారు. అయితే కొండా విషయంలో సీఎం రేవంత్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. కాగా, హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!









