Kangana Ranaut : యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న బహిరంగ వివాదానికి రాఖీ పండగ వేళ తెరపడింది. రాందేవ్ బాబా శాంతి వచనంతో ముందుకు వచ్చి కానుకలు, మిఠాయిలు పంపగా.. కంగనా రనౌత్ దానిని సానుకూలంగా స్వీకరించి ఆయనను తన పెద్దన్నగా అభివర్ణించారు. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న మాటల యుద్ధం ముగిసింది.

“మా చెల్లెలు కంగనా రనౌత్‌కు పోస్ట్ ద్వారా ఈ బహుమతి, మిఠాయిలు పంపిస్తున్నాను. దేశంలో ఎలాంటి కారణం చేతనూ ద్వేషం ఉండకూడదు, ఒకరిపై ఒకరికి శత్రుభావంకూడా కూడదు. అందుకే మేం పగప్రతీకారాలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టాం. ఏ గొడవైనా చర్చల ద్వారానే పరిష్కారం కావాలి. ఈరోజు నేను కంగనాకు ఫోన్ చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు కూడా తెలుపుతాను” అని రాందేవ్ బాబా తెలిపారు. అంతేకాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని, ఇది సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని ఆయన సలహా ఇచ్చారు.

జెన్-జెడ్ Z నిరసనకారులను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన గట్టర్ జనరేషన్ వ్యాఖ్యలపై గత వారం బాబా రాందేవ్ స్పందించారు. ఒక టీవీ ఈవెంట్‌లో ఆమె అర్హతలు, జీవన శైలిని ప్రశ్నిస్తూ ఆమె వ్యాఖ్యలు తప్పు అని ఆయన అన్నారు. దీనిపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. బాబాపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా బదులిచ్చారు. “బాబాజీ, నా యవ్వనం లేదా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనకండి… నా క్యారెక్టర్ మీకంటే చాలా మెరుగైంది. నాపై ఎలాంటి మోసపూరిత ఆరోపణలు లేవు అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. రాందేవ్ బాబా హద్దు దాటారని కూడా ఆమె విమర్శించారు. అయితే, కంగనా వ్యాఖ్యలపై రాందేవ్ బాబా చాలా సంయమనంతో స్పందిస్తూ.. ఈ దేశ ప్రజలకు స్వామి రాందేవ్ ఎవరో, ఆయన చేసిన సేವೆ ఏంటో తెలుసు. అందుకే అలాంటి వారి గురించి నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు అని అన్నారు.

చివరకు రక్షాబంధన్ పండగ సందర్భంగా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. రాందేవ్ బాబా పంపిన కానుకలను స్వీకరించిన కంగనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందిస్తూ.. తప్పులను క్షమించడానికే పండగలు వస్తాయి. చర్చలే వాదనలకు సమాధానం అని నా అన్నయ్య రామ్ దేవ్ చాలా చక్కగా చెప్పారు. పెద్దన్నగా ఆయన ఇస్తున్న ప్రేమను, మిఠాయిలను నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను అని రాసుకొచ్చారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.