Thursday, May 21, 13:33
37.7 C
Hyderabad

Dragon Glimpse: ఎన్టీఆర్ సంచలనం.. రికార్డ్ వ్యూస్‌తో దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ గ్లింప్స్!

Dragon Glimpse
Dragon Glimpse

Dragon Glimpse: ఎన్టీఆర్ డ్రాగన్ Dragon సినిమా గ్లింప్స్ భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ Prashanth Neel తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో Jr NTR డార్క్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. మే 19, 2026 అర్ధరాత్రి విడుదలైన ఈ గ్లింప్స్‌కు కేవలం 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇది భారత్‌లోనే ఒక రోజులో అత్యధిక వ్యూస్ సాధించిన మూవీ గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది.

ఈ గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎన్టీఆర్ కొత్త అవతార్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోపై భారీ చర్చ జరుగుతోంది.

NTR Dragon: ‘పాలిపోయిన ముఖంతో.. బక్కచిక్కిపోయి’.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్ Rukmini Vasanth, అనిల్ కపూర్ Anil Kapoor, బిజు మీనన్ Biju Menon, ఖుష్బు సుందర్ Khushbu Sundar, గురు సోమసుందరం Guru Somasundaram, రాజీవ్ కనకాల Rajeev Kanakala, అశుతోష్ రాణా Ashutosh Rana వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: అభినయ్‌ దర్శన్ ‘హత్యాయత్నం’ డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్

ఈ భారీ చిత్రాన్ని Mythri Movie Makers, NTR Arts కలిసి నిర్మిస్తున్నాయి. సంగీతం Ravi Basrur అందిస్తున్నారు. Dragon సినిమా జూన్ 11, 2027న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.