మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెంచుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ‘బరాకా’ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరగడం కలకలం రేపుతోంది. ఈ దాడి వల్ల ప్లాంట్‌లోని ఓ విద్యుత్ జనరేటర్ వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అబుధాబీ అధికారులు తెలిపారు. అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ సమస్య లేదని తలెత్తలేదని పేర్కొన్నారు. అయితే ఈ డ్రోన్ దాడికి తామే బాధ్యులమని ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థ గానీ, దేశం గానీ అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు.. నలుగురు మృతి
ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చనే బలమైన అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఐరన్ డోమ్’ రక్షణ వ్యవస్థలకు, వారి సైన్యానికి UAE తన భూభాగంపై ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అబుధాబీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరాన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే ఇరాన్ లేదా దాని మద్దతుదారులైన సాయుధ గ్రూపులు బరాకా అణుకేంద్రాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేయొచ్చని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: హర్మూజ్ దాటి భారత్‌కు చేరిన మరో LPG నౌక..
ఇదిలాఉండగా అమెరికా-ఇరాన్ మధ్య వ్యూహాత్మక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ శాంతి చర్చలు ముందుకు సాగడం లేదు. అందుకే ఇరాన్‌కు చెందిన కీలక ఓడరేవులను అమెరికా దిగ్బంధిస్తోంది. ఇరాన్ చమురుకు, వాణిజ్య మార్గాలపై అమెరికా అడ్డు తలుగుతున్న వేళ గల్ఫ్ ప్రాంతంలో భద్రతకు ముప్పు తెచ్చేలా అణువిద్యుత్ కేంద్రంపై దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.







