నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దీన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులని అధికారులు తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని.. పాత రిజిస్ట్రేషన్ వివరాలే చెల్లుతాయని స్పష్టం చేశారు.
<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">📢 NEET (UG) 2026 — Examination Date Announced<br>The National Testing Agency, with the approval of the Government of India, has scheduled the re-examination of NEET (UG) 2026 on Sunday, 21 June 2026.<br>Candidates and parents are requested to rely only on the official channels of NTA.…</p>— National Testing Agency (@NTA_Exams) <a href="https://twitter.com/NTA_Exams/status/2055137455981183411?ref_src=twsrc%5Etfw">May 15, 2026</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
విద్యార్థుల అడ్మిట్ కార్డుల విషయానికొస్తే.. పరీక్షకు 8 నుంచి 10 రోజుల ముందు హాల్ టికెట్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడం వల్ల అభ్యర్థులందరికీ మళ్లీ కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు. పరీక్షా కేంద్రాలు, సమయం లాంటి పూర్తి వివరాలు హాల్ టికెట్లో ఉంటాయి. అభ్యర్థులు అధికారిక సమాచారం కోసం NTA వెబ్సైట్ను క్రమం తప్పకుండా గమనించాలని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని అధికారులు సూచనలు చేశారు.







